బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉజ్జయినీ స్కామ్‌లో సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపట్టాలి : కాంగ్రెస్‌

24 జూన్, 2026

Congress president Jitu Patwari
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 24, 2026, 12:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

భోపాల్‌ : ఉజ్జయినీ భూకుంభకోణం కేసులో సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణకు ఆదేశించాలని మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష‍ుడు జితూ పట్వారీ డిమాండ్‌ చేశారు. ఉజ్జయినీ మాస్టర్‌ ప్లాన్‌ పేరుతో ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ కుటుంబం రూ.వేల కోట్ల లబ్ది పొందినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ సంచలన కథనాన్ని ప్రకటించిన సంగతితెలిసిందే. ఈ భూ కుంభకోణాన్ని ‘మహాకాల్‌ భూమి దోపిడీ’గా ఆయన అభివర్ణించారు. మంగళశారం రాత్రి విడుదల చేసిన ఒక వీడియోలో ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయన సిఎం పదవినిచేపట్టాక, ఆయన కుటుంబానికి చెందిన భూమి 100 ఎకరాల నుండి 335 ఎకరాలకు ఎలా పెరిగిందని జితు పట్వారీ ప్రశ్నించారు. ఒక వార్తాపత్రిక కథనాన్ని ప్రస్తావిస్తూ, డిసెంబర్ 2023 నుండి యాదవ్ , ఆయన కుటుంబం కనీసం 137 ప్లాట్ల రూపంలో మొత్తం 168 ఎకరాలను కొనుగోలు చేశారని పట్వారీ పేర్కొన్నారు. ఈ భూమి విలువ సుమారు ₹45 కోట్లు ఉంటుందని, ఇందులో చాలా ప్లాట్లు ప్రభుత్వం రోడ్డు ప్రాజెక్టులు, భూ వినియోగ మార్పులను ప్రకటించిన ప్రాంతాల్లోనే ఉన్నాయని ఆయన తెలిపారు. వెలుగులోకి వచ్చిన మీడియా కథనాలు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయని, ముఖ్యమంత్రి కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదని, ఆయన మొత్తం రాష్ట్రాన్ని ప్రతిబింబిస్తారని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్