శనివారం, 18 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

రామ మందిర విరాళాల దుర్వినియోగంపై 20న సుప్రీం విచారణ

3 గంటల క్రితం

Supreme Court SC
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 19, 2026, 12:36 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : అయోధ్యలోని రామ మందిరం విరాళాల దుర్వినియోగంపై సక్రమంగా, నిర్దిష్ట కాలపరిమితిలోగా దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సోమవారం సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. ఇందుకు సంబంధించిన నాలుగు వేర్వేరు పిటిషన్లు చీఫ్‌ ‌జస్టిస్‌ ‌సూర్యకాంత్‌, జస్టిస్‌‌ జోమాల్యా బాగ్చిలతో కూడిన బెంచ్‌ ‌ముందుకు విచారణకు రానున్నాయి. ఈ పిటిషన్లను విచారించేందుకు జులై 13న సుప్రీం అంగీకరించింది. ఈ మొత్తం వ్యవహారంపై స్టేటస్‌ ‌రిపోర్ట్‌‌ను తమకు అందజేయాల్సిందిగా ఈ విషయమై దర్యాప్తు కోసం యుపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) కోరింది. దీనిపై స్పందించాల్సిందిగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు కూడా బెంచ్‌ ‌నోటీసులు పంపింది. ఈ కేసులో సిబిఐ దర్యాప్తు జరగాలని కోరుతూ పిటిషనర్లలో ఒకరైన నరేంద్ర కుమార్‌‌గోస్వామి సుప్రీంను ఆశ్రయించారు. రామాలయ ఆర్థిక వ్యవహారాలను చూసే ట్రస్టుకు సంబంధించిన కాగ్‌‌ నివేదికను కూడా అందజేయాల్సిందిగా ఆయన కోరారు. సుప్రీం పర్యవేక్షణలో సిబిఐ దర్యాప్తుతోపాటు ట్రస్టు ఆర్థిక వ్యవహారాలపై ఫోరెన్సిక్‌ ‌ఆడిట్‌ ‌జరగాలని ఆర్‌‌జెడి ఎంపి సుధాకర్‌ ‌సింగ్‌‌ కోరారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్