బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

విందులో ఫుడ్ పాయిజనింగ్ కలకలం

14 గంటల క్రితం

food poisining
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 29, 2026, 08:02 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- 12 మంది అస్వస్థత, పురుగుమందు కలిసిందా?

హర్దోయ్ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో నిర్వహించిన ఓ మరణానంతర విందు విషాదంగా మారింది. విందులో వడ్డించిన కూర తిన్న 12 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కూరలో 'సల్ఫాస్' పురుగుమందు కలిసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రహతౌరా గ్రామానికి చెందిన సందీప్ మరణానంతరం నిర్వహించిన సంస్కార కార్యక్రమంలో బంధువులు, అతిథులకు విందు ఏర్పాటు చేశారు. కూర తిన్న కొందరికి అసాధారణంగా చేదు రుచి రావడంతో పాటు వాంతులు, తలతిరగడం వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆహారం పంపిణీని నిలిపివేసి బాధితులను ఆసుపత్రికి తరలించారు. తర్వాత పెద్ద కుండలో మిగిలిన కూరను పరిశీలించగా, దాని అడుగున మూతలేని 'సల్ఫాస్' పురుగుమందు సీసా కనిపించినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. దీంతో కూరలో పురుగుమందు కలిసిందనే అనుమానం బలపడింది. వంట సమయంలో లేదా అనంతరం పురుగుమందు సీసా కుండలోకి ఎలా చేరిందన్నది ఇప్పటికీ మిస్టరీగా మారింది. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఉద్దేశపూర్వకంగా జరిగిందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనపై పాలి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ విజయ్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ, పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఫిర్యాదు అందిన అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్