సోమవారం, 13 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన - సుప్రీం కోర్టు నిరాకరణ

1 గంట క్రితం

Telangana Government's Request – Supreme Court Rejects It
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 13, 2026, 12:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టు, గోదావరి నీటి వినియోగం, బనకచర్ల అనుసంధానంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. ఎపి ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలని, ఇంజక్షన్‌ ఉత్తర్వులు ఇవ్వాలని తెలంగాణ సర్కార్ పిటిషన్‌లో కోరింది. ఆ అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రధాన పిటిషన్‌లో లోపాలు ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. లోపాలు సరిదిద్దే వరకు విచారణ చేపట్టడం కుదరదని స్పష్టం చేసింది. 15 మంది ప్రతివాదులు ఉన్నారని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. లోపాలు సరిదిద్దిన తరువాత విచారణలో మిగతా అంశాలు పరిశీలిస్తామని కోర్టు పేర్కొంది. పిటిషన్‌పై విచారణ జరపకుండా నోటీసులివ్వలేమని తెలిపింది.





ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్