ఆదివారం, 27 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

దేశంలో మొట్టమొదటి ‘ఎల్ఎన్‌‌జి-డీజిల్’ రైలు

5 గంటల క్రితం

rail
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 27, 2026, 10:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ప్రారంభించిన హోం మంత్రి అమిత్‌‌షా

న్యూఢిల్లీ : దేశంలో మొట్టమొదటి ఎల్‌ఎన్‌‌జి-డీజిల్‌ డ్యూయల్‌ ‌ఫ్యూయల్‌ ‌డెము రైలు ప్రారంభమయింది. ఆదివారం తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించింది. చెన్నైలో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసిఎఫ్‌) దీన్ని అభివృద్ధి చేసింది. ఈ రైలు డ్యూయల్-ఫ్యూయల్ వ్యవస్థను కలిగి ఉండటం వలన కేవలం ఎల్‌ఎన్‌‌జి (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) పైనే ఆధారపడాల్సిన అవసరం లేదు. పరిస్థితులను బట్టి డీజిల్‌కు కూడా మారవచ్చు. భారతీయ రైల్వేల్లో డీజిల్ వినియోగాన్ని తగ్గించడం, స్వచ్ఛమైన, ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. దీనిని వెస్ట్రన్ రైల్వే (డబ్ల్యూఆర్‌) పరిధిలోని అహ్మదాబాద్ డివిజన్ నడుపుతుంది. అలాగే, నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తుంది. గుజరాత్‌లోని సబర్మతి రైల్వే స్టేషన్‌‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌‌షా ఈ రైలును జెండా ఊపి ప్రారంభించారు. సబర్మతి- మహేసన జంక్షన్ మధ్య ఈ రైలు నడుస్తుంది. ​ఈ రెండు స్టేషన్ల మధ్య ఉన్న 62 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు సుమారు 1 గంట 20 నిమిషాల్లో చేరుకుంటుందని అంచనా. జులసాన్, దంగర్వా, అంబిలియాసన్, జగూదాన్ వంటి ముఖ్యమైన స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. ఈ రైల్లో ఎనిమిది కోచ్‌లు ఉన్నాయి. ఇవన్నీ నాన్‌-ఎసి చైర్ కార్ కోచ్‌‌లు. ఈ రైలు ప్రారంభానికి ముందు 2 వేల కిలోమీటర్లకు పైగా క్షేత్రస్థాయిలో ట్రయల్స్‌ను నిర్వహించారు. ఎల్‌ఎన్‌జి ఇంజిన్‌ పనితీరు, విశ్వసనీయతను తనిఖీ చేయడానికి ఈ ట్రయల్స్ చేశారు. ఎల్‌ఎన్‌‌జి ఇంజిన్‌ ‌వినియోగంతో కర్బన్‌ ఉద్గారాల విడుదల తగ్గడంతో పాటు ఆర్థికంగా కూడా ఆదా అవుతుందని రైల్వే అధికారులు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్