ఆదివారం, 09 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎంత అణచివేస్తే అంత ప్రజాదరణ పెరుగుతోంది

22 జులై, 2026

pinarayi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 22, 2026, 10:44 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- సిపిఎం సీనియర్ నేత పినరయి విజయన్

తిరువనంతపురం : నీట్ పరీక్ష అవకతవకలకు సంబంధించి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనను కేంద్ర ప్రభుత్వం ఎంతగా అణచివేస్తే, దానికి అంతగా ప్రజల మద్దతు పెరుగుతోందని సిపిఎం సీనియర్ నాయకుడు, మాజీ కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. వారాలు గడిచినా నిరసన మరింత బలపడుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. పోలీసులతో పాటు లాఠీలు పట్టుకున్న దుండగుల ముఠా కూడా నిరసనకారులపై దాడి చేస్తోందని పేర్కొన్నారు. బొద్దింక జనతా పార్టీ (సీజేపీ) కార్యకర్తలు, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ ప్రారంభించిన ఈ ఉద్యమంలో మొదటి నుంచే వామపక్ష విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయని తెలిపారు. అనంతరం వివిధ ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, ఎంపీలు కూడా ఈ సమ్మెలో భాగస్వాములయ్యారని పేర్కొన్నారు. పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా సిపిఎం ప్రధాన కార్యదర్శితో పాటు పార్టీ కేంద్ర నాయకులు, ఎంపీలు నిరసనకారులకు రక్షణ వలయంగా నిలిచారని పినరయి విజయన్ తెలిపారు.

మంగళవారం లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకత్వం కూడా నిరసనకారులకు మద్దతు ప్రకటించారని ఆయన తెలిపారు. నీట్ పరీక్ష అవకతవకల అంశంతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా కోరుతూ జరుగుతున్న నిరసనను ప్రతిపక్షం లోక్‌సభలో లేవనెత్తేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ అరెస్టును కూడా పినరయి విజయన్ ఫేస్‌బుక్ పోస్టు ద్వారా తీవ్రంగా ఖండించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్