ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపేరు తొలగించిన వ్యక్తి కొత్త ఓటరు కాడు !

05 అక్టోబర్, 2026

పేరు తొలగించిన వ్యక్తి కొత్త ఓటరు కాడు !
ఆటువంటి పేర్ల పునరుద్ధరణకు ప్రత్యేక ప్రక్రియ
మాజీ సిఇసి ఖురేషి సూచన image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026, 12:13 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • అటువంటి పేర్ల పునరుద్ధరణకు ప్రత్యేక ప్రక్రియ

  • మాజీ సిఇసి ఖురేషి సూచన

న్యూఢిల్లీ : తొలిసారిగా ఓటు వేసే వ్యక్తి తన పేరు నమోదు చేసుకోవడం అవసరం. కానీ తప్పుగా పేరు తొలగించబడిన వ్యక్తి కొత్త ఓటరు కిందకు రారని, ఆ వ్యక్తిని మళ్ళీ తొలిసారిగా పేరు నమోదు చేసుకోమని కోరడం కన్నా ఆ వ్యక్తి పేరును పునరుద్ధరించే ప్రక్రియను చట్టం చేపట్టాలని మాజీ సిఇసి ఎస్‌.వై.ఖురేషి అభిప్రాయపడ్డారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)‌ పేరుతో తొలగించబడిన ఓటర్ల పేర్లను పునరుద్ధరించాలన్న ఎన్నికల కమిషన్‌ ‌తాజా నిర్ణయం స్వాగతించదగ్గదే కానీ. చాలా ఆలస్యంగా తీసుకున్న దిద్దుబాటు చర్య అని ఆయన వ్యాఖ్యానించారు. ముసాయిదా ఓటర్ల జాబితాల నుండి దాదాపు 13కోట్ల పేర్లు అదృశ్యమైన నేపథ్యంలో ఎస్‌ఐఆర్‌‌కు ముందు, తర్వాత ఓటర్ల జాబితాలను పోల్చిచూడాల్సిందిగా 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని అధికారులను ఇసి ఆదేశించింది. గల్లంతైన ఓటర్ల పేర్లను గుర్తించి, వారిని తిరిగి జాబితాలో చేర్చేందుకు సాయపడాలని కోరింది. 2024 తర్వాత అర్హత పొందిన యువ ఓటర్లను ఎందుకు సక్రమంగా నమోదు చేయలేదని ఆయన ప్రశ్నించారు. దరఖాస్తులు, తిరస్కరణలు, పెండింగ్‌ ‌కేసులకు సంబంధించి పారదర్శకంగా వివరాలు అందచేయాలని ఆయన కోరారు. గతంలోనే ఓటర్లుగా నమోదైన వారిని ఫారమ్‌ 6‌ను ఉపయోగించాలని కోరడాన్ని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ ఫారమ్‌‌ కేవలం తొలిసారి ఓటరుకు మాత్రమే ఉద్దేశించినది అయినపుడు దానిపై డిక్లరేషన్‌ ‌జారీ చేయడం అవసరమని ఆయన పేర్కొన్నారు. తప్పుగా పేర్లు తొలగించబడిన వారి పేర్లను పునరుద్ధరించడానికి ప్రత్యేకంగా ఫారమ్‌ 6ఎక్స్‌ను రూపొందించాలని ఖురేషి ప్రతిపాదించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్