సోమవారం, 27 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమాదకద్రవ్యాల విక్రయం చట్టవిరుద్దం

13 జులై, 2026

ADANI AIRPORTS
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 13, 2026, 11:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • అదానీ గ్రూప్‌ వాదన చెల్లదు

  • కోర్టుకు తెలిపిన కేంద్రం

ముంబయి : ముంబాయిలోని ఛత్రపతి శివాజీ మహరాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆదాని ఎయిర్‌‌పోర్టు)లో జరుగుతున్న మాదక ద్రవ్యాల విక్రయం చట్ట విరుద్దమని కేంద్ర ప్రభుత్వం ముంబాయి హైకోర్టుకు తెలిపింది.ఈ ఏయిర్‌‌పోర్టులో నికోటిన్‌‌ పౌచ్‌‌లను విక్రయిస్తున్నారు. దీనిని ఈ ఏడాది మార్చి నెలలో డ్రగ్స్‌ ‌నియంత్రణ అధికారులు కనుగున్నారు. అయితే కస్టమ్స్‌ ‌గోదాముల్లో నిల్వ చేశామని, అంతర్జాతీయ ప్రయాణీకులకు మాత్రమే విక్రయిస్తున్నామని, భారత చట్టాలు వర్తించవని అదాని గ్రూపు వాదించింది. అయితేచ ఉత్పత్తులు భారత భూభాగంలోకి ప్రవేశించిన క్షణం నుంచే భారత చట్టాలు అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కస్టమ్స్ బాండ్ గోదాములో ఉంచడం వల్ల చట్టపరమైన బాధ్యత నుంచి మినహాయింపు లభించదని కోర్టుకు తెలిపింది. అవసరమైన అనుమతులు లేకుండా ఈ ఉత్పత్తులను విక్రయించడం కేవలం సాంకేతిక లోపం కాదని, ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పు కలిగించే చర్య అని వాదించింది. కస్టమ్స్ గోదాముల్లో నిల్వ ఉంచి అంతర్జాతీయ ప్రయాణికులకు మాత్రమే విక్రయిస్తున్నందున భారత చట్టాలు వర్తించవని అదానీ గ్రూప్ చేసిన వాదనను కేంద్రం తోసిపుచ్చింది. నికోటిన్ ఉత్పత్తులు వ్యసనాలకు దారి తీస్తాయని, ఇటువంటి ఉత్పత్తుల విక్రయానికి అనుమతి ఇస్తే ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావం పడటమే కాకుండా.. దేశంలోని విమానాశ్రయాల్లో నికోటిన్ ఉత్పత్తుల నియంత్రణకు సంబంధించిన భవిష్యత్ విధానాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది.​ ఈ ఉత్పత్తుల విక్రయం చట్టబద్ధమేనంటూ అదానీ గ్రూప్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని కేంద్రం కోర్టును కోరింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్