బస్సు లోయలోపడి తొమ్మిది మంది మృతి
మరో 25 మందికి గాయాలు
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ తెహ్రీ గర్వాల్ జిల్లా గులార్ ఘాటి ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదంలో తొమ్మిదిమంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మంది గాయపడ్డారు. గులార్ ఘాటి ప్రాంతంలో బస్సు అదుపు తప్పి సుమారు వంద మీటర్ల లోతులో ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. హరిద్వార్ నుంచి జోషిమఠ్‌కు ప్రయాణి స్తుండగా, బస్సు ప్రమాదానికి గురయింది. రోడ్డు క్కన ఉన్న రెయిలింగ్‌ను ఢీకొట్టుకుంటూ లోయలో పడిపోయింది. ఏడుగురు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు ఎయిమ్స్ - రిషికేశ్‌లో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుం బాలకు ఒక్కొక్కరికీ రూ. 2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 1 లక్ష, స్వల్ప గాయాలైన వారికి రూ. 40 వేలు ఆర్థిక సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు. ఉత్తరాఖండ్‌లో 24 గంటల వ్యవధిలో జరిగిన మరో నాలుగు ప్రమాదాల్లో మరో ఎనిమిదిమంది మరణించారు. తెహ్రీ గర్వాల్, రుద్రప్రయాగ్ జిల్లాల్లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం మధ్య ఈ ప్రమాదాలు జరిగాయి. సోమవారం రాత్రి రుద్రప్రయాగ్ జిల్లాలోని హనుమాన్ ఆలయం సమీపంలో జరిగిన మరో ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మృతి చెందారు_








కామెంట్‌లు (0)