- 32 మంది జవాన్లకు గాయాలు
గౌహతి: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీఎస్‌ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్కు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో 32 మంది జవాన్లు గాయపడ్డారు. బోంగైగావ్ జిల్లాలోని డాంగ్‌టోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారి 31సీపై బల్గిరి ప్రాంతంలో గురువారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ఎన్నికల విధులు ముగించుకుని జవాన్లు తిరిగి వస్తుండగా ట్రక్కు ప్రమాదానికి గురైంది. ప్రమాద శబ్దం విన్న స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన 32 మంది జవాన్లను బోంగైగావ్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వాహనంపై నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమిక అంచనా. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలను తెలుసుకునేందుకు అధికారులు విచారణ చేపట్టారు.







కామెంట్‌లు (0)