సోమవారం, 24 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఎమ్మెల్యేలకు గాయాలు

1 గంట క్రితం

Delhi road accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 24, 2026, 11:57 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ఢిల్లీలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కిరారి సిట్టింగ్‌ ఎమ్మెల్యే అనిల్‌ ఝా, కర్ణాటక ఎమ్మెల్యే అభయ్‌ పాటిల్‌ సహా ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. పీడబ్ల్యూడీ కార్యాలయం సమీపంలో రాత్రి 9.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. లక్ష్మీనగర్‌ నుంచి ఐటీవో వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి తొలుత డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం రైలింగ్‌ను దాటి ఎదురుగా వస్తున్న ఇన్నోవా కారును ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఇన్నోవాలో ఎమ్మెల్యేలు అనిల్‌ ఝా, అభయ్‌ పాటిల్‌ ఉన్నారు. మరో కారును అశుతోష్‌ పాండే (32) డ్రైవ్‌ చేస్తుండగా, ఆయన భార్య, ఇద్దరు మైనర్‌ పిల్లలు అందులో ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం లోక్‌నాయక్‌ జై ప్రకాశ్‌ ఆస్పత్రికి తరలించగా, వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంపై దర్యాప్తుకు ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్