- లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థులుగా వందలాది నామినేషన్లు
ఆగర్తల : త్రిపుర గిరిజన ప్రాంతాల స్వయంప్రతిపత్తి జిల్లా మండలి (టిటిఎఎడిసి)కు చెందిన గ్రామ కమిటీలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం వందలాది మంది 'లెఫ్ట్ ఫ్రంట్' అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. త్రిపురలో మొత్తం 58 బ్లాకులలోని 52 బ్లాకుల పరిధిలో ఉన్న 587 గ్రామ కమిటీలకు ఈ నెల 28న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 8 చివరి తేదీ. ఈ క్రమంలో నామినేషన్ల ప్రక్రియ ముమ్మరంగా జరుగుతుంది. ఈ ఎన్నికల్లో ప్రజల హక్కులు, అభివృద్ధి, వారు ఎదుర్కొంటున్న దైనందిన సమస్యలనే సిపిఎం ప్రచార ఆస్ర్తాలుగా చేసుకుంటుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జితేంద్ర చౌదరి ప్రకటించారు.








కామెంట్‌లు (0)