- రాత్రి యూనివర్శిటీ హాస్టల్‌లోకి చొరబడి విద్యంసం
- భాదితులపై పోలీసుల లాఠీచార్జి
- ఖండించిన కేరళం మాజీ మూఖ్యమంత్రి పినరయి విజయన్
తిరువనంతపురం: తిరువనంతపురం యూనివర్సిటీ కాలేజీ హాస్టల్‌లోకి చొరబడి ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులపై యూత్ కాంగ్రెస్ గూండాలు దాడికి తెగబడ్డాయి. బుధవారం సిఇసి జ్ఙానేష్ కుమార్‌ను తొలగించాలని నిరసన ర్యాలి చెపడుతున్నామని చెప్పి కాంగ్రెస్ ఎంపి షాఫీ పరంబిల్ నేతృత్వంలో యూనివర్సిటీ కాలేజీ హాస్టల్‌లో దౌర్జజ్యానికి దిగారు. యూనివర్శిటీ గేటు వద్ద ఉన్న ఎస్‌ఎఫ్‌ఐ బ్యానర్లను ధ్వంసం చేశారు. హాస్టల్‌లోకి కాగడాలను విసిరేశారు. దీంతో హాస్టల్‌లో మంటలు చెలరేగాయి. అనంతంరం పోలీసులు యూనివర్శిటీలోకి చొరబడి ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులపై లాఠీ చార్జీ చేశారు. యూత్ కాంగ్రెస్ నాయకులు యూనివర్శిటీని విద్వంసం చేస్తే, మాపై పోలీసులు లాఠీచార్జీ చేశారని విద్యార్థులు మీడియాకు తెలిపారు. ఈ దాడిలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ముగ్గురు విద్యార్థుల తలకు తీవ్ర గాయాలుకావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు.
ముందస్తు ప్రణాళికతోనే దాడి : పినరయి విజయన్
యూత్ కాంగ్రెస్ గూండాలు అత్యంత క్రూరంగా దాడి చేశారని మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శించారు. ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థుల వైపు నుంచి ఎలాంటి రెచ్చగొట్టే చర్య జరగలేదని ఆయన పేర్కొన్నారు. హాస్టల్‌లో ఉన్న విద్యార్థులపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడి ముందస్తు ప్రణాళికతో జరిగిందని విమర్శించారు. ఆందోళనకారులు హాస్టల్‌లోకి నిప్పుకాగడాలు విసిరారని ఆరోపించారు. లాఠీచార్జిలో గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలిస్తుండగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అంబులెన్స్‌ను అడ్డుకున్నారని, ఇది అమానవీయ చర్య అని విమర్శించారు. విద్యార్థులపై జరిగిన దాడికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతాయని ఆయన అన్నారు. సిపిఎం తిరువనంతపురం జిల్లా కార్యదర్శి వి. జోయ్, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి వి. శివన్‌కుట్టి, వి.కె. సనోజ్ ఘటనాస్థలికి చేరుకున్నారు.







కామెంట్‌లు (0)