ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎన్నికల ద్వారానే పాలకుల మార్పు

8 గంటల క్రితం

raj
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026, 10:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​- రాజ్యాంగమే మా ఆయుధం

- ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌

న్యూఢిల్లీ: దేశంలో పాలకులను మార్చాలన్న తమ లక్ష్యం ఎన్నికలు, రాజ్యాంగబద్ధమైన మార్గాల్లోనే నెరవేరుతుందని ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్‌రాజ్‌ స్పష్టం చేశారు. బంగ్లాదేశ్‌, నేపాల్‌ తరహాలో ప్రభుత్వాలను కూలదోసే పరిస్థితి భారత్‌లో లేదనీ, ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ప్రభుత్వాన్ని మార్చేందుకు పోరాడతామని ప్రకటించారు. యూపీ నుంచి 2029 లోక్‌సభ ఎన్నికల వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ''భారత్‌ నేపాల్‌ కాదు.. బంగ్లాదేశ్‌ కాదు. మనకు అంబేద్కర్‌, గాంధీ, భగత్‌సింగ్‌ ఉన్నారు. రాజ్యాంగం ఉంది. ఓటు హక్కు ఉంది'' అని ప్రకాశ్‌రాజ్‌ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో శుక్రవారం తలపెట్టిన తిరంగా మార్చ్‌కు ముందు కాక్రోచ్‌ జనతా పార్టీ (సిజెపి) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కేను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ఆయన స్పందించారు. ప్రజలతో చర్చించకుండా కేంద్ర ప్రభుత్వం బలప్రయోగానికి దిగుతోందని ప్రకాశ్‌రాజ్‌ ఆరోపించారు. ప్రశ్నించే హక్కు, నిరసన తెలిపే హక్కు, ఓటు హక్కు ప్రజలకు ఉన్నాయనీ, వీటిని ఉపయోగించుకోవడం అరాచకం కాదన్నారు. తమ చేతుల్లో ఆయుధాలు లేవనీ, రాజ్యాంగమే తమ ఆయుధమని వివరించారు. ‘హర్‌ ఘర్‌ తిరంగా’ నినాదం ఇచ్చిన ప్రధాని మోడీని ఉద్దేశించి మాట్లాడుతూ.. జాతీయ జెండాతో ర్యాలీకి వెళ్లాలనుకుంటున్న యువతను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రకాశ్‌రాజ్‌ ప్రశ్నించారు. నిరసనల్లో మహిళలపై పోలీసులు దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ అంశాన్ని పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు లేవనెత్తాలని కోరారు. రైతులు, సంయుక్త కిసాన్‌ మోర్చా, పౌరసమాజ సంస్థల మద్దతుతో రానున్న రోజుల్లో నిరసనలను మరింత విస్తరిస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్