కొచ్చి: ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఓ యువతిని కలమస్సేరిలోని ఓ ప్రాంతానికి పిలిపించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను నిందితులు చిత్రీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో శ్రీరాజ్, జితు అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. స్పా మేనేజర్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి యువతిని అక్కడికి రప్పించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితుల్లో మరో యువతి కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 2న ఈ ఘటన జరిగినట్లు సమాచారం. నలుగురు వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు తన భర్తకు చెప్పడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బాధితురాలు కలమస్సేరి మెడికల్ కాలేజీ ఐసీయూలో చికిత్స పొందుతోంది. అరెస్టయిన నిందితులు ఎర్నాకుళం ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మిగిలిన నిందితుల కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.







కామెంట్‌లు (0)