సోమవారం, 13 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

క్యూబాపై కొనసాగుతున్న అమెరికా అమానవీయ దిగ్బంధనం

1 రోజు క్రితం

america
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 12, 2026, 09:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఇంధన కొరతతో మరోమారు కుప్పకూలిన పవర్‌‌గ్రిడ్‌

- నిర్వీరామంగా కొనసాగుతున్న పునరుద్ధరణ పనులు

హవానా : అమెరికా అమానవీయ ఆర్థిక, ఇంధన దిగ్బంధం కారణంగా క్యూబా కటిక చీకట్లలో మనుగడ సాగించాల్సివస్తోంది. ఇంధన కొరత కారణంగా వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి క్యూబా పవర్‌ ‌గ్రిడ్‌ ‌వ్యవస్థ కుప్పకూలడంతో దేశవ్యాప్తంగా అనేక చోట్ల కారుచీకట్లు కమ్ముకున్నాయి. ప్రజలు దీపపు వెలుగుల్లోని పనులు చేసుకోవాల్సివస్తోంది. కాగా అమెరికా దిగ్బంధనాన్ని క్యూబా ప్రతిఘటిస్తూ ముందుకెళ్తోంది. బ్లాకఅవుట్ (విద్యుత్ సరఫరాలో అంతరాయం) జరిగిన పవర్ గ్రిడ్‌ను పునరుద్ధరించేందుకు క్యూబాలో కార్మికులు అవిశ్రాంతంగా పని చేస్తున్నారు. దశాబ్ద కాలంగా క్యూబా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దేశంలో ఆరు దశాబ్దాల కమ్యూనిస్టు పాలనకు చరమగీతం పాడుతామని ఘీంకరిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటిల ప్రయత్నాలు చేస్తున్న సంగతి విదితమే. అందులో భాగంగానే ఈ ఏడాది జనవరిలో ఇంధన దిగ్బంధాన్ని విధించారు. దీంతో పరిస్థితి మరింత దిగజారింది. కాగా శనివారం రాత్రికి రాజధాని హవానాలో కేవలం 12 శాతం గృహాలకు మాత్రమే విద్యుత్ సౌకర్యాన్ని కల్పించారు. పరిస్థితులను బట్టి విద్యుత్ సౌకర్యాన్ని పునరుద్ధరించే పనులు క్రమేపీ జరుగుతున్నాయని ప్రభుత్వ విద్యుత్ సంస్థ తెలిపింది. ఆరు నెలల వ్యవధిలో హవానాలో విద్యుత్ బ్లాక్ అవుట్ జరగడం ఇది నాలుగోసారి. 2024 తర్వాత ఆరోసారి. పవర్ గ్రిడ్ తాజాగా శుక్రవారం విఫలమైంది. అమెరికా చమురు దిగ్బంధనం కారణంగా పరిస్థితి చాలా క్లిష్టంగా ఉన్నదని క్యూబా అధ్యక్షుడు మిగుయెల్ డియాజ్`కానెల్ చెప్పారు. జనవరిలో క్యూబాకు కేవలం ఒక రష్యా ట్యాంకర్‌ను మాత్రమే అమెరికా అనుమతించింది. అందులో లక్ష టన్నుల ముడి చమురు ఉంది. ఆ ట్యాంకర్ మార్చిలో క్యూబాకు చేరుకోగా ప్రస్తుతం నిల్వలు ఆవిరైపోతున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్