మంగళవారం, 28 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

మీ మేనిఫెస్టోలో ఇంతవరకు 60 శాతం హామీలు అమలుకాలేదు : వి.శ్రీనివాసరావు

2 గంటల క్రితం

cpim
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 28, 2026, 11:49 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : రాష్ట్ర స్థాయి ఎన్నికల మేనిఫెస్టోలో ఇంతవరకు 60 శాతం వాగ్దానాలు అమలుకాలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం విజయవాడలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో శ్రీనివాసరావు మాట్లాడుతూ ..... గడిచిన రెండేళ్ల పాలన గురించి ప్రజలకు తెలపడానికి రాష్ట్రంలోని ప్రభుత్వం పూనుకున్నదని అన్నారు. ఈ రెండేళ్ల పాలనలో ప్రజలకిచ్చిన హామీలను ఎంతవరకు పూర్తి చేశారు ? అని ప్రశ్నించారు. సూపర్ సిక్స్ లో కూడా 60 శాతం ఇంతవరకు అమలుకాలేదన్నారు. మహిళలకు, నిరుద్యోగులకు ఇస్తామన్న భృతి ఇవ్వలేదని, రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వలేదని... పైగా రైతుల వద్ద నుండి బలవంతంగా భూములను లాక్కొని కార్పొరేట్లకు ఇస్తున్నారని ఆరోపించారు. పిల్లలే సంపద అని సిఎం చంద్రబాబు అంటున్నారని, ఎలాగూ ఎల్ నినో ప్రభావంతో రైతులు పంటలు పండక నష్టపోతున్నారు కాబట్టి వారి వద్ద నుండి భూములను లాక్కొని కార్పొరేట్లకు ఇస్తున్నారు... రైతులు, ప్రజలు మాత్రం పిల్లలను కని ఆ పిల్లలు పెరిగి వారి రెక్కల కష్టం మీదనే బతికేలా చేయాలని చెబుతున్నారు అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర స్థాయి ఎన్నికల మేనిఫెస్టోలో ఇంతవరకు 60 శాతం వాగ్దానాలు అమలుకాలేదని చెప్పారు.



సంబంధిత వార్తలు


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్