మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రజలకు ప్రజా ప్రతినిధులు జవాబుదారీగా ఉండాలి : వి.శ్రీనివాసరావు

28 జులై, 2026

Public representatives must be accountable to the people: V. Srinivasa Rao
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 28, 2026, 12:48 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

విజయవాడ : ప్రజలు తమ సమస్యలపై ప్రశ్నించాలని, ప్రజలకు ప్రజా ప్రతినిధులు జవాబుదారీగా ఉండాలని వి.శ్రీనివాసరావు కోరారు. సుప్రీం కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠం నేర్చుకోవాలని, ప్రజా ఉద్యమాలు, ఆందోళనపై నిర్బంధం వద్దు అని స్పష్టం చేశారు. మంగళవారం విజయవాడలోని బాలోత్సవ్ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ .... ఎల్‌నినో కరువు కారణంగా .... 21 జిల్లాలో వర్షాభావం 56 శాతం లోటుగా ఉందన్నారు. 249 మండలాలు తీవ్ర లోటును ఎదుర్కొంటున్నాయని, 359 మండలాల్లో లోటు వర్షపాతం ఉందన్నారు. 2 మండలాల్లోనే అత్యధిక వర్షపాతం నమోదయిందన్నారు. ఇప్పటి వరకు 225 యంయంకి గాను 104 యంయం మాత్రమే వర్షాలు పడ్డాయని తెలిపారు. సీజన్ మొత్తం వర్షపాతం 580 యంయం గా ఉందన్నారు. పశ్చిమ గోదావరి 77.9 శాతం, అన్నమయ్య 70.9 శాతం, అంబేద్కర్ కోనసీమ 69.5 శాతం, తూర్పు గోదావరి 65.7 శాతం, విశాఖపట్నం 65 శాతం, ప్రకాశం 63.9 శాతం, చిత్తూరులో 61.5 శాతం వర్షపాతం నమోదయిందన్నారు. 168 మండలాలలో 1357 రైతు సేవా కేంద్రాల పరిధిలో ఖరీఫ్ ఎండిపోతున్నదని తెలిపారు. ఖరీఫ్ సాగు 30.84 లక్షల హెక్టార్లు. ఇప్పటి వరకు 16.35 (39 శాతం) గా ఉందన్నారు. ఇప్పటికే మొక్కజొన్న ఎండిపోయిందన్నారు. రాష్ట్రమంతా నీటి ఎద్దడి వచ్చిందని, విశాఖ అరిలోవలో డేటా సెంటర్ వస్తే తాగేనీరు కూడా దొరకదు అని చెప్పారు. 34 శాతం మాత్రమే వరినాట్లు పడ్డాయని, 50 శాతం విస్తీర్ణంలో పంటలు లేవు అని, వేరుశనగ పడలేదు అని వివరించారు. కరువు మండలాలను వెంటనే ప్రకటించాలని, ప్రత్యామ్నాయ పంటలకు సహాయం చేయాలని కోరారు. కరువు సహాయం ప్రకటించాలన్నారు. ఉచిత పంటల భీమా చట్టం తేవాలన్నారు. మంచినీటి కొరతను అధిగమించాలన్నారు. అప్పుల మాఫీ చేయాలన్నారు. పొగాకు రైతులకు ప్రతి కిలోకి రూ.50లు ఇవ్వాలని వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్