విజయవాడ : మంగాదేవి మృతి విద్యా రంగానికి, మహిళా లోకానికి బాలల పురోగాభివృద్ధికి తీరనిలోటు అని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. దీనికి సంబంధించి శనివారం వి.శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రముఖ విద్యావేత్త, సామాజిక సేవాతత్పరులు శ్రీమతి నన్నపనేని మంగాదేవి మృతికి భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ సంతాపం తెలియజేస్తున్నదన్నారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటిస్తున్నదన్నారు. మహిళా సాధికారతకు, బాలల వికాసానికి మంగాదేవి జీవితాంతం కృషి చేశారని తెలిపారు. గుంటూరులో వెంకటేశ్వర బాలకుటీర్ ను ప్రారంభించి విద్యావిధానంలో స్వతంత్ర ఆలోచన, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సృజనాత్మకత పెంపొందించేలా విద్యాభోదనకు ప్రాముఖ్యతనిచ్చారని స్మరించుకున్నారు. బాలల కోసం 25 పుస్తకాలు రచించి అనేక అవార్డులందుకున్నారని తెలిపారు. గ్రామీణ బాలల అభివృద్ధి కోసం అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణనిచ్చారని అన్నారు. మంగాదేవి మృతి విద్యా రంగానికి, మహిళా లోకానికి బాలల పురోగాభివృద్ధికి తీరనిలోటు అని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.
మంగాదేవి మృతి విద్యా రంగానికి, మహిళా లోకానికి బాలల పురోగాభివృద్ధికి తీరనిలోటు : వి.శ్రీనివాసరావు
20 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 28, 2026, 01:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)