మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఫిర్యాదుల స్వీకరణకు నెలాఖరు వరకు గడువు పెంచండి

02 సెప్టెంబర్, 2026

The responsibility of registering votes lies with the Election Commission: CPI(M)
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 11:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఎన్నికల సంఘానికి సిపిఎం డిమాండ్‌

  • ఇంటింటికి సిబ్బందిని పంపాలి

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఎన్నికల సంఘం నోటీసులు అందించిన లక్షలాది మంది ఓటర్ల ఇంటింటికి సిబ్బందిని పంపి అందరి ఓటర్ల వివరాలు సేకరించి వాటిని నమోదు చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం తీసుకోవాలని, ఇందుకోసం ఫిర్యాదుల స్వీకరణకు గడువు నెలాఖరు వరకు పెంచాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పేరుతో రాష్ట్రంలో లక్షలాది మంది అర్హులైన ఓటర్లను కుంటి సాకులతో తొలగించడం సరికాదని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. మరొక పది రోజులపాటు అభ్యంతరాలు, నమోదుకు గడువు పెంచడం మంచిదే కానీ అది చాలదని, దాన్ని నెలాఖరు వరకు పొడిగించాలని కోరారు. లక్షలాది మందిని కార్యాలయాలకు విచారణ పేరుతో పిలిపించడం తగదని తెలిపారు. సిబ్బంది సంఖ్యను పెంచి, ఇంటింటికి తిరిగి అర్హులైన ప్రతి ఒక్కరి వద్ద ఉన్న పత్రాల ఆధారంగా అందరి ఓటర్లను నమోదు చేసి, తుది జాబితాలో వారి పేర్లు ఉండే విధంగా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. పరిశీలన సందర్భంలో పత్రాలు లేవనే కారణాలతో ఓట్లను తొలగించే చర్యలు తీసుకోవద్దని సూచించారు. చిన్న చిన్న తప్పులను సిబ్బంది సరిదిద్దాలని, అవసరమైన సందర్భాల్లో మళ్ళీ పరిశీలన చేసి అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు నిలబడే విధంగా తగు చర్యలు తీసుకోవాలని శ్రీనివాసరావు డిమాంద్‌ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్