సోమవారం, 19 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రత్యర్థులపై టిడిపి దాడులు ఆపాలి..

10 గంటల క్రితం

CPI(M) State Committee strongly condemns illegal arrests of Gannavaram Airport residents
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026, 04:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఏకపక్షంగా వ్యవహరించకుండా నామినేషన్లను ఆమోదించాలి

- ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకోవాలి

- సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో: కనిగిరి మున్సిపాలిటీలో స్క్రూటినీ సందర్భంగా ప్రతిపక్షాల అభ్యర్థులను అడ్డుకుని ఏకపక్షంగా పోటీ లేకుండా గెలిచినట్లు ప్రకటించుకోవాలని టిడిపి చూస్తోందని సిపిఎం రాష్ట్ర కమిటీ విమర్శించింది. ఈ కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్క్రూటినీతో నిమిత్తం లేకుండా ప్రతిపక్షాల నామినేషన్స్ ఆమోదించాలని, లేదా ఎన్నిక రద్దు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. కనిగిరి 29వ వార్డులో పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థి పి నరేంద్ర, ఆయనకు మద్దతుగా వెళ్లిన సిపిఎం పట్టణ కార్యదర్శి కేశవరావు వద్దనున్న రసీదులను లాక్కొని దాడిచేసి బయటకు గెంటేశారని వివరించారు. ఓటమి భయంతోనే టిడిపి గూండాగిరికి పాల్పడుతుందని, ప్రజాస్వామ్యాన్ని చెరబట్టి గెలవాలనుకోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి వీలుగా నామినేషన్లు వేసిన అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ప్రేక్షకులుగా మారారని ఆందోళన వ్యక్తం చేశారు. పాలక పార్టీకి మద్దతునిస్తూ వారి గూండాగిరిని కళ్ళప్పగించి చూస్తూ సహకరించారని పేర్కొన్నారు. ఎన్నికల అధికారులు నిస్సహాయంగా మారారని, టిడిపి అరాచకాలను ఆపాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. కనిగిరిలో జరుగుతున్న అరాచకాలపై జిల్లా ఎన్నికల అధికారి తక్షణమే చర్యలు తీసుకుని ఆపాలని డిమాండ్‌ ‌చేశారు. అభ్యర్థులను స్క్రూటినీకి హాజరయ్యేలా రక్షణ ఏర్పాటు చేయాలని, ఆ విధంగా షెడ్యూల్ టైమ్‌లో చేయనట్లయితే సమయం పొడిగించి వారిని విచారించి వారి పత్రాలను ఆమోదించాలని కోరారు.


cpim letter


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్