సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏటుకూరి కృష్ణమూర్తి మృతికి వి.శ్రీనివాసరావు సంతాపం

1 గంట క్రితం

yetukuri
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 04:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయవాడ : స్వాతంత్య్ర పోరాట యోధుడు ఏటుకూరి కృష్ణమూర్తి (102) మృతికి సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. దీనికి సంబంధించి సోమవారం వి.శ్రీనివాసరావు ఓ ప్రకటనను విడుదల చేశారు. ఏటుకూరి కృష్ణమూర్తి గుంటూరు జిల్లా స్వాతంత్య్రోద్యమ చరిత్రతోపాటు పలువురు స్వాతంత్య్ర సమరయోధుల జీవిత విశేషాలను, ఛాయాచిత్రాలను, ఇది మా ఊరు, ప్రజా వైద్యులు మొదలగు పుస్తకాలు రచించారని తెలిపారు. తండ్రి సీతారామయ్య అందించిన జాతీయోద్యమ స్పూర్తితో స్వాతంత్య్రోద్యమ పోరాటంలో క్విట్ ఇండియా ప్రదర్శనలో పాల్గొన్నందుకు ఆయనను 15 రోజులపాటు బ్రిటీష్ ప్రభుత్వం జైలులో నిర్బంధించిందని గుర్తు చేశారు. అనంతరం 1946లో జరిగిన ఉద్యమంలో 8 నెలల పాటు లాహోర్ జైలులోనే గడిపారని తెలిపారు. ఏటుకూరి కృష్ణమూర్తి మరణం అభ్యుదయ, వామపక్ష ఉద్యమాలకు తీరని లోటని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విచారాన్ని వ్యక్తం చేశారు.
cpim




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్