బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

సిపిఎం కార్యాలయంపై ఢిల్లీ పోలీసుల దాడిని ఖండిస్తున్నాం : సిపిఎం నిరసన ప్రదర్శన

10 గంటల క్రితం

We condemn the Delhi Police raid on the CPM office: CPM protest demonstration
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 29, 2026, 12:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి : సిపిఎం కార్యాలయంపై ఢిల్లీ పోలీసుల దాడిని ఖండిస్తూ .... బుధవారం విజయవాడ నగర సిపిఎం నాయకులు విజయవాడ బీసెంట్ రోడ్డు మహంతి మార్కెట్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. సిపిఎం ప్రధాన కార్యాలయంలోకి ఢిల్లీ పోలీసులు దౌర్జన్యంగా చొరబడి, విద్యార్థి నాయకురాలు ఐషి గోష్‌ను అక్రమంగా అరెస్ట్ చేసేందుకు చేసిన యత్నాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్బంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్. బాబురావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ .... ప్రశ్నించే విద్యార్థులపై తప్పుడు కేసు పెడుతూ అక్రమ అరెస్ట్లు చేయడం సిగ్గుచేటన్నారు. విద్యాశాఖ మంత్రి రాజీనామాను డిమాండ్ చేస్తూ ... ఆందోళన చేపట్టిన విద్యార్థుల పై కేసు పెట్టబోం అని చెప్పిన కేంద్రం ఒక్కరోజులోనే మాటతప్పి దుర్మార్గంగా విద్యార్థుల అరెస్టులకి యత్నిస్తుదన్నారు. శాంతియుత నిరసన ప్రజల హక్కు అని నిన్ననే సుప్రీం కోర్టు తీర్పునిచ్చిందని, అయినప్పటకీ ప్రభుత్వం, పోలీసులు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థుల పై దాడి చేసి తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులన్నిటినీ కొట్టివేసే వరకు సిపిఎం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సెంట్రల్ సిటీ కార్యదర్శి భూపతి.రమణ, పశ్చిమ నగర కార్యదర్శి సత్తిబాబు, తూర్పు నగర కార్యదర్శి పి.కృష్ణ, సిపిఎం నాయకులు ఎం. సీతారాములు, కె.దుర్గారావు,ఎన్. నాగశ్వరరావు, వై. సుబ్బారావు, ఎం. సోమేశ్వరరావు, టి. ప్రవీణ్, సూరిబాబు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్