శనివారం, 25 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

'విద్యార్థుల పోరాట విజయం` : సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ

9 గంటల క్రితం

State government must abandon its policy of coercion: CPI(M) State Committee
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 25, 2026, 04:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయవాడ : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను 'విద్యార్థుల పోరాట విజయం`గా సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ అభివర్ణించింది. 22 మంది విద్యార్థులను బలి తీసుకొన్న “విద్యా మాఫియా” పై విజయం సాధించిన విద్యార్థులను, యువతీ యువకులను సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ అభినందించింది. దీనికి సంబంధించి శనివారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఓ ప్రకటనను విడుదల చేశారు. ఎట్టకేలకు యువశక్తి ముందు మోడీ ప్రభుత్వం తలవంచక తప్పలేదన్నారు. రాజీనామా చేశాక కూడా ఉద్యమంపై జాతి వ్యతిరేకులంటూ నిందలు మోపడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు అంగీకరించి విద్యా వ్యవస్థను కార్పొరేట్ చెరనుండి విముక్తి చేయాలని, లేదంటే మున్ముందు మరిన్ని ప్రతిఘటనలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దేశవ్యాపితంగా ఎంతో పట్టుదలతో, మొక్కవోని దీక్షతో పోరాడిన ఫలితంగానే కేంద్ర విద్యాశాఖమంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తీవ్రమైన నిర్బంధాన్ని సైతం ఎదుర్కొని దేశవ్యాపితంగా వివిధ తరగతులు ఇచ్చిన మద్దతుతో విద్యార్థులు, యువకులు చేసిన పోరాట ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదని చెప్పారు. విద్యార్థుల కోర్కెలలో ప్రధానమైన విద్యా మంత్రి రాజీనామా చేసినా ప్రశ్నాపత్రాల లీకేజిలకు ప్రధాన కారణమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఎన్‌టిఏ రద్దుకు వ్యతిరేకంగా అలాగే విద్యా వ్యవస్థలో ఈ అవకతవకలకు మూల కారణమైన ఎన్ఈపి (నూతన విద్యా విధానం 2020)కి వ్యతిరేకంగా కూడా భవిష్యత్తులో పోరాటం కొనసాగుతుందని వి.శ్రీనివాసరావు తెలిపారు.

cpim


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్