ఆదివారం, 25 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionదేశంలో 76% విచారణ ఖైదీలే : జస్టిస్ సేథ్నా

1 గంట క్రితం

76% of prisoners in the country are undertrials: Justice Sethna
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026, 11:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

దేశంలోని ఖైదీల్లో 76 శాతం మంది విచారణ ఖైదీలేనని బాంబే హైకోర్టు న్యాయమూర్తి అద్వైత్ ఎం సేథ్నా తెలిపారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) గణాంకాల ప్రకారం దేశంలోని 5.73 లక్షల ఖైదీల్లో ఇంతమంది విచారణలో ఉన్నారని చెప్పారు. ఒక్క గుజరాత్‌లోనే 11 వేల మంది విచారణ ఖైదీలున్నారన్నారు. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ సహకారంతో గుజరాత్ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (జిఎన్‌ఎల్‌యు) నిర్వహించిన ‘న్యాయ్ అభిగం’ ముగింపు వేడుకలో ఆయన మాట్లాడారు. న్యాయం అందించడంలో జాప్యాన్ని నివారించేందుకు క్రమబద్ధమైన కేసు విచారణ కీలకమని, ప్రతి విచారణ ఖైదీ కేసునూ తరచూ పర్యవేక్షించే వ్యవస్థ ఉండాలని సూచించారు. ఖైదీలకు తమ హక్కులపై అవగాహన లేకపోవడం దేశంలోని సమస్యల్లో ఒకటని అన్నారు. మహిళలు, కుటుంబ మద్దతు లేనివారు, వ్యసనాలతో బాధపడేవారు వంటి బలహీన వర్గాల ఖైదీలపై ఈ కార్యక్రమం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. న్యాయ విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని, తరగతి గదుల్లో నేర్పలేని పాఠాలను ఖైదీలతో నేరుగా మమేకమవడం ద్వారా నేర్చుకోవచ్చని ఆయన సూచించారు. న్యాయం పొందే హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 21, 39ఏల్లో ఉందని గుర్తు చేశారు. అలాగే, మరో ముఖ్య అతిథిగా హాజరైన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధు మాట్లాడుతూ, అభివృద్ధి చెందిన దేశానికి ఆర్థిక వృద్ధితో పాటు చట్టబద్ధ పాలన, పారదర్శక సంస్థలు, జవాబుదారీతనం, ప్రజా విశ్వాసం, న్యాయం పొందే హక్కు కూడా కీలకమన్నారు. కృత్రిమ మేధ, డేటా రక్షణ, సైబర్ భద్రత వంటి సవాళ్ల నేపథ్యంలో భవిష్యత్ న్యాయ నిపుణులకు సాంకేతిక అవగాహన, స్వతంత్ర ఆలో చన, నైతిక విచక్షణ కూడా అవసరమని చెప్పారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్