న్యూఢిల్లీ : సౌదీ రాజధాని రియాద్, దమ్మామ్, జెడ్డాకు రాకపోకలు సాగించే అన్ని విమానాల రద్దును అక్టోబర్ 20 వరకు పొడిగిస్తున్నట్లు ఎయిర్ ఇండియా శుక్రవారం ప్రకటించింది. సౌదీ అరేబియాలోని విమానాశ్రయాలు, విమానాలు, విమానయాన మౌలికసదుపాయాలపై జరిగిన దాడులను అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసిఎఒ) మండలి తీవ్రంగా ఖండించింది. సౌదీ ప్రభుత్వానికి, ప్రజలకు సంఘీభావం ప్రకటించిన సంగతి తెలిసిందే. విమానాల రద్దును అక్టోబర్ 20 వరకు పొ డిగిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ పోస్ట్లో పేర్కొంది. పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, విమానాల రాక పోకల పున: ప్రారంభంపై త్వరలో ప్రకటన విడుదల చేస్తామని తెలిపింది. విమానాల రద్దు వలన ప్రభావితమైన ప్రయాణికుల నగదును వాపసు చేయనున్నట్లు తెలిపింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రత, రక్షణ తమ అత్యంత ప్రాధాన్యత అని పునరుద్ఘాటించింది. పశ్చిమాసియాలో పెరుగుతున్న భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో భారతీయ విమానయాన సంస్థలైన ఇండిగో, అకాశా ఎయిర్ గతంలో ప్రకటించిన విమాన సర్వీసుల నిలిపివేతల తర్వాత, ఎయిర్ ఇండియా కూడా తాజాగా ఈ పొడిగింపును ప్రకటించింది.
అక్టోబర్ 20 వరకు విమానాల రద్దు పొడిగింపు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 16, 2026, 12:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)