ఆదివారం, 19 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

అఖిలపక్ష సమావేశం - విపక్షాలు వాకౌట్ ..!

8 గంటల క్రితం

All-party meeting – Opposition parties walk out!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 19, 2026, 12:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : రేపటి నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల ప్రారంభం కానున్న వేళ .... కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన అఖిలపక్షం భేటీ ఆదివారం జరిగింది. తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన రెబల్‌ ఎంపి లు ఏర్పాటు చేసిన నేషనలిస్ట్‌ సిటిజన్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌సీపీఐ)కి ఆహ్వానం పంపడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలు సమావేశాన్ని బహిష్కరించాయి. గుర్తింపులేని పార్టీని అఖిలపక్ష సమావేశానికి ఎలా పిలిచారని ప్రశ్నించాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపి సౌగత రాయ్‌ ఈ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్‌ అధికారిక గుర్తింపు లేని పార్టీకి సమావేశంలో చోటు కల్పించడం సరికాదన్నారు. పార్లమెంట్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ఇప్పటికీ ఆ పార్టీ ఎంపి లు తృణమూల్‌ సభ్యులుగానే నమోదై ఉన్నారని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితుల్లో వారికి ప్రత్యేక పార్టీ హోదాతో ఆహ్వానం పంపడం అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. తృణమూల్‌కు చెందిన సుమారు 20 మంది రెబల్‌ ఎంపీలు ఇటీవల నేషనలిస్ట్‌ సిటిజన్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాలో చేరారు. అయితే ఆ పార్టీకి ఇంకా అధికారిక గుర్తింపు లభించలేదు. ఈ అంశమే ఇప్పుడు అఖిలపక్ష సమావేశం చుట్టూ రాజకీయ చర్చకు దారి తీసింది. ఇదిలా ఉండగా.... మరోవైపు ఎన్‌సీపీఐ పార్లమెంటరీ పక్ష నేత కాకోలి ఘోష్‌ దస్తిదార్‌ స్పందించారు. తమ పార్టీకి అఖిలపక్ష సమావేశంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్‌లో తమ అభిప్రాయాలు వినిపించే అవకాశంగా దీన్ని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.








ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్