- అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సిపిఎం పొలిట్ బ్యూరో ప్రకటన
న్యూఢిల్లీ : అలహాబాద్ హై కోర్టు తీర్పు లౌకికవాదాన్ని, మైనార్టీ హక్కులను, సాధారణ పౌరుల జీవనోపాధిని దెబ్బతీస్తుందని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) పేర్కొంది. ఈ మేరకు పోలీట్ బ్యూరో శనివారం ప్రకటన విడుదల చేసింది. ఇటీవల సయ్యద్ రషీద్ అలీ వర్సెస్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సిపిఎం ఖండించింది. ఈ తీర్పు లౌకికవాదం, మైనారిటీ హక్కులు, సాధారణ పౌరుల జీవనోపాధిని దెబ్బతీస్తుందని ప్రకటనలో తెలిపింది. ఆరాధనా స్థలాల చట్టం, 1991పై కోర్టు చేసిన వ్యాఖ్యానం తీవ్రంగా తప్పుదోవ పట్టించేదిగా ఉంది. ‘ప్రజా ప్రయోజనాల’ కోసం మసీదులను స్వాధీనం చేసుకోవడాన్ని సమర్ధించడం ద్వారా కోర్టు లౌకిక రక్షణను అర్థరహితం చేసిందని సిపిఎం అభిప్రాయపడింది. ఒక మసీదును రహదారి కోసం కూల్చివేసినప్పుడు, దాని మతపరమైన స్వభావం అంతరించిపోతుంది. ఇది స్వాధీనం ద్వారా జరిగే మత మార్పిడి, సరిగ్గా దీనిని నివారించడానికే ఈ చట్టం ఉద్దేశించబడింది. దాని మతపరమైన స్వభావం కూడా అదృశ్యమవుతుంది. అయితే ఇది స్వాధీనం ద్వారా మార్పిడి, చట్టం నిరోధించడానికి ఉద్దేశించినది.
అద్దెకు తీసుకున్న వారి హక్కులను కోర్టు నిర్లక్ష్యం చేయడం విస్మయం కలిగించింది. స్వాధీనం చేసుకునే విషయాలలో అద్దెదారులకు 'ఎలాంటి హక్కులు లేవని' కోర్టు తెలపడం అన్యాయం. ఇందులో దాదాపు తొంభై ఏడు శాతం మంది ముస్లింలున్నారు, దాల్మండిలో తరతరాలుగా వీరు ఒప్పందాలు చేసుకుని, వ్యాపారాలు చేసుకుంటున్నారు. అయితే ఒక నివేదిక ప్రకారం 50 శాతం కుటుంబాలు అక్కడ నివసిస్తున్నారు. 45 శాతంకు పైగా జీవనోపాధి పొందుతున్నారని, అయినప్పటికీ, ఆర్టికల్ 21 ప్రకారం వారి జీవనోపాధి హక్కును కోర్టు విస్మరించిందని సిపిఎం ప్రకటనలో వివరించింది. ఇది భోజ్‌శాల తీర్పు, కొనసాగుతున్న మసీదు వివాదాల సరళిని అనుసరిస్తుందని, ఇది భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చాలనే బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండాకు అనుగుణంగా మైనారిటీలపై జరుగుతున్న వ్యవస్థీకృత దాడిగా సిపిఎం పేర్కొంది. కాశీ విశ్వనాథ ఆలయానికి చాలా దగ్గరగా ఉన్న సోనార్ గలి వంటి ప్రత్యామ్నాయ స్థలాలను (800 మీటర్లతో పోలిస్తే 100 మీటర్లు) చాలా తక్కువ సమయంలో అభివృద్ధి చేయవచ్చు. కానీ, ప్రభుత్వం దాల్మండిని, ముస్లిం మెజారిటీ ప్రాంతాన్ని ఎంచుకోవడం గమనార్హం. అలాగే, న్యాయమైన పరిహారం, పునరావాస చట్టం ప్రకారం పునరావాసం, నిర్థిష్టమైన భూసేకరణ, పారదర్శక హక్కు చట్టం 2013 ఉల్లఘనలను కూడా కోర్టు పరిష్కరించడంలో విఫలమైందని, దీనిపై సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని ఈ తీర్పును రద్దు చేయాలని సిపిఎం పొలిట్‌బ్యూరో ప్రకటనలో పేర్కొంది.







కామెంట్‌లు (0)