న్యూఢిల్లీ : ద్విచక్ర వాహన అంబులెన్సులకు అనుమతి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు-1989కి సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్ర రహదారులు, రవాణాశాఖ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రామీణ, మారుమూల, కొండ ప్రాంతాల్లోని పల్లెలకు వేగవంతమైన వైద్య సేవలు అందించడం కోసం ఈ ద్విచక్ర వాహన అంబులెన్సుల విధానాన్ని తీసుకొస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఇప్పటివరకూ కేంద్ర మోటారు వాహనాల నిబంధనల పరిధిలో ద్విచక్ర అంబులెన్సులు లేవు. దానివల్ల వాటి రూపురేఖలు, నిర్వహణ, రోగులను హ్యాండ్లింగ్ చేసే విధానం, రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ తనిఖీలకు అవసరమైన నిబంధనలు ఖరారు చేయడానికి వీలు లేకుండా పోయింది. నిబంధనలను సవరించడం వల్ల ఈ అంబులెన్సులు ప్రభుత్వ నియంత్రణ పరిధిలోకి రానున్నాయి. ఎల్ 2 కేటగిరీ ద్విచక్ర వాహనాలను అంబులెన్సులుగా ఉపయోగించడానికి అనుమతిస్తారు. రాష్ట్రాలు నిర్దేశించిన ప్రాంతాల్లోనే ఇవి సేవలు అందించడానికి వీలుంటుంది. ఈ ముసాయిదా నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు ఉన్నవారు 30 రోజుల్లోగా కేంద్ర రహదారులు, రవాణాశాఖకు పంపాల్సి ఉంటుంది. వాటిని పరిశీలించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ను జారీ చేస్తుంది.
త్వరలో ద్విచక్ర అంబులెన్సులకు అనుమతి
16 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 04, 2026, 09:47 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)