న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు తీర్పు తనకు న్యాయవ్యవస్థపై అవిశ్వాన్ని కలిగించిందని2002 గుజరాత్ అల్లర్ల బాధితురాలు బిల్సిస్ బానో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఉత్తర్వులకు వ్యతిరేకంగా పోరాడతానని స్పష్టం చేశారు. సీనియర్ న్యాయవాది శోభా గుప్తా ద్వారా బిల్కిస్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం నాటి తీర్పు తనను దిగ్భ్రాంతికి, బాధకు గురిచేసిందని, న్యాయవ్యవస్థపై అవిశ్వాన్ని కలిగించిందని పేర్కొన్నారు. ‘‘మరోసారి, అంటే రెండవసారి కూడా సుప్రీంకోర్టు నన్ను పిలవకుండానే ఒక ఉత్తర్వు జారీ చేసిందంటే నమ్మలేకపోతున్నాను. తీర్పు గురించి నాకు పత్రికా కథనాల ద్వారా తెలిసింది’’ అని ఆ ప్రకటనలో తెలిపారు. ‘‘నాకు అన్యాయం చేసిన నిందితుల శిక్షను సుప్రీంకోర్టు ఎలా నిలిపివేయగలదు. కనీసం నాకు సమాచారం కూడా ఇవ్వలేదు. కోర్టులో నా వాదనను ఎందుకు వినలేదు ’’ అని బానో ప్రశ్నించారు. అక్టోబర్ 28న ఈ ఉత్తర్వులు జారీ చేయడానికి ముందు కూడా తనకు సమాచారం ఇవ్వలేదని, తన వాదనను కూడా వినిపించలేదని ఆమె తెలిపారు. ‘‘శిథిలమైన జీవితాన్ని తిరిగి నిర్మించుకున్నాను. నవ్వడం నేర్చుకున్నాను. కానీ, అక్టోబర్ 28 నాటి ఉత్తర్వులు నన్ను మరోసారి భయాందోళనకు గురిచేశాయి’’ అని అన్నారు. అక్టోబర్ 28 నాటి ఉత్తర్వులను తాను వ్యతిరేకిస్తున్నానని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘ నేను తప్పనిసరిగా ఈ పోరాటం చేయాలి. నా పిల్లల కోసం ఈ నిర్ణయం తీసుకున్నాను. వారు జీవితాంతం భయాలు, గాయాల జ్ఞాపకాలతో బతకాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరి కోసం కూడా నేను ఈ పోరాటం చేస్తున్నాను. ఎందుకంటే ఏ మహిళా, బాధితురాలైనా, పౌరురాలైనా తమ అస్తిత్వాన్ని, సమానత్వ హక్కును నిరూపించుకునేందుకు నిరంతరం పరీక్షలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉండకూడదు. జీవితాంతం న్యాయం కోసం పోరాడాల్సిన దుస్థితి రాకూడదు’’ అని ఆమె ప్రకటనలో స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా పోరాడతానని పునరుద్ఘాటించారు. 2002 గుజరాత్ అల్లర్ల కేసులో సుప్రీంకోర్టు సోమవారం ఇద్దరు నిందితుల జీవిత ఖైదును రద్దు చేయడంతో పాటు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
న్యాయవ్యవస్థపై అవిశ్వాసం కలిగించిన సుప్రీంకోర్టు తీర్పు : బిల్కిస్ బానో
7 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 17, 2026, 05:00 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)