బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

రాజ్యసభలో ‘వందేమాతరం’పై బిల్లు ఆమోదం - ప్రతిపక్షాలు వాకౌట్

5 గంటల క్రితం

Bill on ‘Vande Mataram’ passed in Rajya Sabha – Opposition stages walkout.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 29, 2026, 04:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : జాతీయ గేయం వందేమాతరం పై బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. ఈ బిల్లును కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్‌ ఈ నెల 24న ప్రవేశపెట్టారు. వందేమాతరాన్ని అవమానించినా, ఆలపిస్తుండగా ఆటంకం కలిగించినా నేరంగా పరిగణించేలా చట్టం చేయనున్నారు. వందేమాతరం బిల్లులో భాగంగా ది ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఇన్సల్ట్స్‌ టు నేషనల్‌ ఆనర్‌-1971లో సవరణలు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. ప్రస్తుతం జాతీయ గీతమైన జనగణమనకు ఉన్న చట్టపరమైన రక్షణను వందేమాతరానికి కూడా వర్తింపజేయడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. వందేమాతరాన్ని అవమానించడాన్ని నేరంగా పరిగణించి, దోషులకు గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష విధించేలా ఈ బిల్లులో నిబంధనలు రూపొందించారు. బిల్లుపై సభలో చర్చ ప్రారంభం కాగానే .... ప్రతిపక్ష నేతలు భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఇటీవల ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు బలప్రయోగం చేశారని... దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు వచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిమాండ్ చేసిన విషయమై ఏమాత్రం స్పందించకుండా చర్చలో పాల్గొనాలంటూ ... డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్ ఆందోళనకారులను కోరారు. అయితే ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు బలప్రయోగం చేశారని... దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు వచ్చి వివరణ ఇవ్వాలని ప్రతిపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ.... కేంద్ర సహాయ మంత్రి రాందాస్‌ అఠావలె బిల్లుపై మాట్లాడుతుండటం ప్రారంభించారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు ఆ సభ నుంచి వాకౌట్ చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్