బుధవారం, 21 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బొద్దింక దిష్టిబొమ్మ దహనం.. అభిజీత్‌ దీప్కే వ్యంగ్యాస్త్రం

2 గంటల క్రితం

231587-abhikeet-dipke-cockroch.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026, 08:36 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • తమ పార్టీకి ఉచిత ప్రచారం కల్పిస్తున్నారంటూ వ్యాఖ్య

న్యూఢిల్లీ : దసరా సందర్భంగా ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో 30 అడుగుల బొద్దింక బొమ్మను దహనం చేయాలన్న నిర్ణయంపై కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే వ్యంగ్యంగా స్పందించారు. తమ పార్టీకి ఉచితంగా ప్రచారం కల్పిస్తున్నందుకు రామ్‌లీలా కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. స్వచ్ఛ భారత్‌, స్వచ్ఛ ఢిల్లీ కార్యక్రమాల్లో భాగంగా రావణుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తుల దిష్టిబొమ్మలతో పాటు బొద్దింక బొమ్మను కూడా దహనం చేయనున్నట్లు రామ్‌లీలా కమిటీ వెల్లడించింది.

మరోవైపు, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన ఆందోళనలను దీపావళి వరకు తాత్కాలికంగా విరమించాలని అభిజీత్‌ దీప్కే తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. పండుగ సమయంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని సూచించారు. నిరసనల్లో పాల్గొంటున్న యువత క్షేమంపై వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న పార్టీ నేతలు సౌరవ్‌ దాస్‌, అశుతోష్‌ కుటుంబాలు కూడా ఆవేదనలో ఉన్నాయని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్