శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కేంద్ర బడ్జెట్ సంప్రదింపుల సమావేశంలో సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎళమరం కరీం

20 నవంబర్, 2026

citu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 06:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- కార్మికవర్గ కొనుగోలు శక్తే ఆర్థిక వృద్ధికి ప్రధాన చోదకశక్తి

ఢిల్లీ : 2027–28 కేంద్ర బడ్జెట్‌కు సంబంధించి నవంబర్ 20న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్వహించిన ముందస్తు సంప్రదింపుల సమావేశంలో సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎళమరం కరీం పాల్గొన్నారు. ఈ సమావేశంలో కార్పొరేట్ సంస్థలకు పన్ను రాయితీలు కల్పించినప్పటికీ ఉద్యోగాల కల్పన, వేతనాల పెరుగుదలకు అవి దోహదపడలేదని ఆయన స్పష్టం చేశారు. సంప్రదింపుల సమావేశానికి ప్రధాన కేంద్ర కార్మిక సంఘాలను ఆహ్వానించకపోవడంపై సిఐటియు తరఫున తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇది దీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రజాస్వామ్య సంప్రదాయాలకు విరుద్ధమని పేర్కొన్నారు. లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏను పునరుద్ధరించాలని, కనీస వేతనాన్ని రూ.42,000గా నిర్ణయించాలని, అందరికీ రూ.21,000 కనీస పెన్షన్ కల్పించాలని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యం, విద్య రంగాలపై ప్రభుత్వ వ్యయాన్ని పెంచాలని, ఇందుకోసం సంపద పన్ను, వారసత్వ పన్ను విధించాలని సూచించారు. కార్మికవర్గ కొనుగోలు శక్తే ఆర్థిక వృద్ధికి ప్రధాన చోదకమని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్