ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మరోసారి వాణిజ్య సిలిండర్‌ ధర పెంపు

1 గంట క్రితం

Commercial LPG
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026, 10:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : వాణిజ్య సముదాయాల్లో వినియోగించే ఎల్‌పిజి సిలిండర్‌ ధరను కేంద్రం మరోసారి పెంచింది. ఆదివారం వాణిజ్య ఎల్‌పిజి సిలిండర్‌ ధరను సుమారు 10రూపాయలు పెంచింది. వరుసగా మూడవ నెల సిలిండర్‌ ధరను పెంచడం గమనార్హం. అక్టోబర్ 1న వాణిజ్య ఎల్‌పిజి సిలిండర్ ధరను కేంద్రం రూ.65 పెంచిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ నెలలో కూడా దేశవ్యాప్తంగా సిలిండర్‌కు సుమారు రూ.10 చొప్పున ధరను పెంచారు. ప్రస్తుతం ఢిల్లీలో ఒక సిలిండర్ ధర రూ.2,820గా ఉంది.


ఎటిఎఫ్‌ ధర పెంపు

విమానాలకు ఇంధనంగా వినియోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఎటిఎఫ్‌) ధరను లీటరుకు రూ.1.37 మేర పెంచింది. దీంతో ప్రస్తుతం ఎటిఎఫ్‌ లీటరు ధర రూ.138.5కి చేరింది. సెప్టెంబర్ 1న లీటరుకు రూ.6.28 పెంచగా, ఆ తర్వాత అక్టోబర్ 1న ఎటిఎఫ్‌ ధరను లీటరుకు సుమారు రూ.16 మేర పెంచింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్