సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసిట్ దర్యాప్తు కొనసాగించండి

2 గంటల క్రితం

ayodhyasc.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026, 12:02 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • అయోధ్య విరాళాల కేసులో సుప్రీం తీర్పు

​న్యూఢిల్లీ: అయోధ్య రామాలయంలో విరాళాల చోరీపై సిట్ దర్యాప్తును కొనసాగించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. సోమవారం సిబిఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించింది. ఈ కేసును దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఛార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇటీవల అయోధ్య ఆలయం కానుక‌ల‌ను చోరీ చేసిన కేసులో సిబిఐ నేతృత్వంలో స‌త్వ‌ర విచార‌ణ చేప‌ట్టాల‌ని పిటీష‌న్ దాఖ‌లైంది. అయోధ్య రామాల‌య నిధుల దుర్వినియోగం కేసులో విచార‌ణ చేప‌ట్టాల‌ని కోరుతూ ఇద్ద‌రు అడ్వ‌కేట్లు పిల్ దాఖ‌లు చేశారు. రామ మందిరంలో జ‌రిగిన అక్ర‌మాల‌ను వెలికి తీసేందుకు సిబిఐతో పాటు ఇత‌ర ఏజెన్సీల నేతృత్వంలో ద‌ర్యాప్తు జ‌ర‌గాల‌ని ఆ పిటీష‌న్‌లో కోరారు.

​చట్ట ప్రకారం ముందుకు సాగాలి

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ కేసును విచారించింది. ధర్మాసనంలో జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి మోహన కూడా ఉన్నారు. ‘‘ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్టేటస్ రిపోర్టు దాఖలు చేసింది. దాని ప్రకారం ఈ కేసులో ఇప్పుడు ఛార్జిషీట్ దాఖలైంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రిట్ పిటిషన్‌ను, దానికి అనుబంధంగా ఉన్న ఇతర వ్యాజ్యాలను పరిష్కరిస్తున్నాం. చట్ట ప్రకారం కేసులో ముందుకు వెళ్లాలని సంబంధిత జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌ను ఆదేశిస్తున్నాం’’ అని ధర్మాసనం పేర్కొంది. అలాగే, ఈ కేసులో ప్రజా ప్రయోజనం ఇమిడి ఉన్నందున, నేరబాధితులు కోర్టుకు సహకరించేందుకు చట్టం అనుమతించినట్లే, రిట్ పిటిషనర్లు కూడా మేజిస్ట్రేట్‌కు సహాయపడేందుకు స్వేచ్ఛ కల్పిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. ‘‘ఇది కేవలం నిందితుడికి, ప్రభుత్వానికి మధ్య ఉన్న సాధారణ కేసు కాదు. ఇందులో ప్రజా ప్రయోజనం కూడా ఉంది. అందుకే నేరబాధితులకు చట్టం కల్పించిన తరహాలోనే కోర్టుకు సహకరించేందుకు మీకు అవకాశం ఇస్తున్నాం’’ అని సిజెఐ వ్యాఖ్యానించారు. అవసరమైన చోట కోర్టుకు సహాయం కొనసాగించవచ్చని, ఇందుకు అనుమతించాలని ట్రయల్ కోర్టుకు సూచిస్తామని ఆయన పిటిషనర్లకు చెప్పారు.

​లెక్కింపు సమయంలో చోరీ...

ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, చోరీ ఎక్కువగా విరాళాల లెక్కింపు సమయంలోనే జరిగిందని కోర్టుకు తెలిపారు. ‘‘లెక్కింపు చేసిన వ్యక్తులే సొమ్ము తీసుకున్నారు’’ అని ఆయన చెప్పడం గమనార్హం. కొద్ది రోజుల సిసిటివి ఫుటేజీ మాత్రమే అందుబాటులో ఉందన్నారు. ‘‘మేం పరిశీలించాం. వారు డబ్బు తీసుకుని ఎక్కడో పెట్టుబడి పెట్టడమో, బ్యాంకు ఖాతాల్లో జమ చేయడమో చేసేవారు. అందుకే నిందితులుగా ఉన్న ప్రతి ఉద్యోగి బ్యాంకు ఖాతాలనూ తనిఖీ చేశాం. ఎంత మొత్తం జమ అయిందో లెక్కగట్టాం. ఆ మొత్తం మా వద్ద ఉంది. కొందరు ఆస్తుల్లో పెట్టుబడి పెట్టారు’’ అని మెహతా చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్