న్యూఢిల్లీ : కేరళలో విద్యా ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతూ పోలీసు తూటాలకు బలైపోయిన యువ కిశోరాలు రాజీవన్, రోషన్, శిబులాల్, మధు, బాబు, అలాగే ఆ కాల్పుల్లో తీవ్రంగా గాయపడి జీవన్మరణ పోరాటంలో ఇటీవల అమరుడైన పుష్పన్‌కు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్స్కిస్టు) ఘన నివాళులర్పించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. 1994 నవంబరు 25న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ విద్యా ప్రయివేటీకరణ విధానాలను, అవినీతి, అక్రమాలను నిరసిస్తూ కన్నూరులోని కుతుపరంబలో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ), భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) శాంతియుతంగా ఆందోళన చేపట్టింది. నిరంకుశత్వ కాంగ్రెస్ ప్రభుత్వ ఆదేశాలతో శాంతియుత పోరాటంపై ఖాకీలు విచక్షణారాహిత్యంగా దాడులు చేశారు. లాఠీలతో విరుచుకుపడ్డారు. కాల్పులు కూడా జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోగా..అనేక మంది గాయపడ్డారు. నాటి కాల్పుల్లో జీవచ్ఛవంగా మారిన పుష్పన్ దాదాపు మూడు దశాబ్దాల పాటు మంచానికే పరిమితమై మృత్యువుతో పోరాడుతూ 2024 సెప్టెంబరు నెలలో కన్నుమూశారు. చనిపోయే వరకు ప్రతి ఉద్యమానికి ఆయన మంచం మీదనే వచ్చి మౌనంగానే సంఘీభావం తెలియజేస్తూ చైతన్య స్ఫూర్తి రగిలించేవారు. ప్రభుత్వ విద్యా రంగాన్ని కాపాడేందుకు, నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా సాగిన కుతుపరంబ పోరాటం విద్యార్థి, యువజన పోరాటాలకు నిత్య స్ఫూర్తిగా నిలుస్తోంది. నాటి పోరాటంలో అమరులైన యువ యోధులకు జోహార్లు అని సిపిఎం పేర్కొంది.
Print Editionకుతుపరంబ అమరవీరులకు సిపిఎం నివాళి
23 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 26, 2026, 12:19 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)