న్యూఢిల్లీ : గ్రేట్ రష్యా విప్లవం రగిల్చిన స్పూర్తిని గుర్తు చేసుకుంటూ సిపిఎం నివాళి అర్పించింది. సాధారణ ప్రజలు సాగించిన అసాధారణ విప్లవమని వ్యాఖ్యానించింది. సోషలిజం సిద్ధాంతాల పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ లాంగ్ లివ్ సోషలిజం అంటూ నినదించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. 1917 నవంబరు 7వ తేదీన కామ్రేడ్ వ్లాదిమిర్ లెనిన్ నేతృత్వంలో బోల్షివిక్కులు అప్పటి అవినీతి ప్రభుత్వాన్ని కూల్చివేశారు. ప్రపంచంలోనే తొలి సారిగా కార్మిక వర్గం నేతృత్వాన సోషలిస్టు దేశాన్ని స్థాపించారు. చరిత్ర పుటల్లో కార్మిక వర్గం విజయవంతమైన ఆగమనాన్ని చాటి చెప్పారని ఆ ట్వీట్ పేర్కొంది.
రష్యా విప్లవ స్ఫూర్తికి సిపిఎం నివాళి
07 నవంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 07, 2026, 08:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)