ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

అమెరికా దిగ్బంధాన్ని ఎదుర్కొంటూ దృఢంగా నిలబడిన క్యూబా

1 గంట క్రితం

cuba
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 27, 2026, 12:12 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- సిపిఎం ఆధ్వర్యాన ఢిల్లీలో సంఘీభావ సభలో వక్తలు​

​న్యూఢిల్లీ: క్యూబాకు మద్దతు తెలుపుతున్న భారత ప్రజలకు,ప్రగతిశీల సంస్థలకు ఆ దేశ రాయబారి జువాన్ కార్లోస్ మార్సన్ కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం నాడు హరికిషన్ సింగ్ సుర్జీత్ భవన్‌లో భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) క్యూబా సంఘీభావ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా కార్లోస్ మాట్లాడుతూ తమ దేశానికి భారతీయులు మద్దతు తెలుపుతున్నారన్నారు. దశాబ్దాల కాలంగా ఆర్థిక దిగ్బంధనం, తీవ్ర ఒత్తిళ్లు ఎదురవుతున్నప్పటికీ క్యూబా చూపుతున్న పట్టుదలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. శాంతి, సార్వభౌమాధికారం, సామాజిక న్యాయాన్ని రక్షించడంలో అంతర్జాతీయ సంఘీభావం ప్రాముఖ్యతను తెలియపరిచారు. ఆయన ప్రసంగాన్ని ప్రొఫెసర్ సోనియా హిందీలోకి అనువదించారు. అలాగే, అమెరికా నిర్భందాన్ని క్యూబా దృఢంగా ఎదుర్కొంటుందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్‌ అరుణ్ కుమార్‌ తెలిపారు. క్యూబాకు తమ పార్టీ అచంచలమైన మద్దతిస్తుందన్నారు. క్యూబాపై కొనసాగుతున్న ఆర్థిక దిగ్బంధనాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆ దేశంపై అమెరికా ఆర్థిక దిగ్బంధనాన్ని వెంటనే ముగించాలని, సార్వభౌమాధికారాన్ని, స్వీయ నిర్ణయాధికారాన్ని గౌరవించాలన్నారు. అలాగే సిపిఎం ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి అనురాగ్ సక్సేనా ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, వేదికపై సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు మరియం ధావలే, ఎస్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి సృజన్ భట్టాచార్య, డివైఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి హిమగ్న భట్టాచార్య, ఐద్వా ప్రధాన కార్యదర్శి కనికా ఘోష్‌‌తోపాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వందలాది మంది పార్టీ సభ్యులు, కార్యకర్తలు, మద్దతుదారులు పాల్గొని క్యూబా ప్రజలకు తమ అచంచలమైన సంఘీభావాన్ని ప్రకటించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్