సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

రోజులతరబడి నీళ్లలోనే .. బాలుడి వింత ప్రవర్తన ..!

1 గంట క్రితం

Days spent in the water... a boy's strange behavior...!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 10, 2026, 03:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

పశ్చిమ బెంగాల్ : సాధారణంగా మనిషి ఎక్కువ‌సేపు నీళ్ల‌లో ఉండాలంటే ఇబ్బందిపడతాడు. కానీ ఓ 16 ఏళ్ల బాలుడు ఇక్బాల్ షేక్ మాత్రం రోజుల త‌ర‌బ‌డి నీళ్ల‌లోనే ఉంటున్నాడు. వారంలో ఏకంగా నాలుగైదు రోజులు నీళ్ల‌లోనే గడుపుతున్నాడు. ఒక్కోసారి ఏడు రోజులపాటు రాత్రిపగలూ చెరువు లో ఉంటున్నాడు. బ‌య‌టికి వ‌స్తే ఒళ్లంతా మంట‌గా ఉంటోంద‌ని, నీళ్ల‌లోనే హాయిగా ఉంద‌ని చెబుతున్నాడు. అతడి వింత ప్రవర్తన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్‌ జిల్లా బెల్దాంగాకు చెందిన 16 ఏళ్ల ఇక్బాల్‌ షేక్‌ గత ఐదేళ్లుగా బ‌య‌ట‌కంటే ఏళ్ల‌లోనే ఎక్కువ‌గా ఉంటున్నాడు. అత‌డు చెరువుల్లోనే ఎక్కువ‌గా గడుపుతున్నాడ‌ని స్థానికులు చెబుతున్నారు. అయితే శరీరంలో మంటగా అనిపించడం వల్లే నీటిలో ఉంటున్నానని ఇక్బాల్‌ చెబుతున్నాడు. నీళ్ల నుంచి బయటకు రాగానే మంట మొదలవుతుందని, నీటిలోకి వెళ్లగానే ఉపశమనం కలుగుతుందని అంటున్నాడు. ఇలా రోజుల తరబడి నీటిలో ఉండటంతో అతడు అనారోగ్యాల బారిన‌ప‌డుతున్నాడు. చర్మవ్యాధులు వ‌స్తున్నాయి. త‌ర‌చూ జలుబు, దగ్గు వెంటాడుతున్నాయి. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకున్నా ఫలితం లేకుండాపోయింది. ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లే స్తోమత తమకు లేదని ఇక్బాల్‌ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దాంతో అతడికి చికిత్స చేయించేందుకు స్థానికులు ముందుకొస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్