గురువారం, 19 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చెత్తకుండీలో యువతి మృతదేహం

1 గంట క్రితం

murder
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 09:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • డెహ్రాడూన్‌లో దారుణం..

  • ముఖం, మెడపై లోతైన గాయాలు

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ప్రేమ్‌నగర్‌లోని జమున్‌వాలా ప్రాంతంలో ఓ యువతి మృతదేహం చెత్తకుండీలో లభ్యమైంది. బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలి వయసు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే డెహ్రాడూన్ సిటీ ఎస్పీ శేఖర్ చంద్ర సుయల్‌తో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి ముఖం, మెడపై లోతైన గాయాలు ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. మరో ప్రాంతంలో యువతిని హత్య చేసిన అనంతరం, ఆధారాలు చెరిపివేసేందుకు మృతదేహాన్ని చెత్తకుండీలో పడేసి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మృతురాలి వివరాలు, గుర్తింపును తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్