ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చెన్నై మేయర్‌ ప్రియ పై డీప్ ‌ఫేక్‌ దాడి

17 గంటల క్రితం

Deepfake attack on Chennai Mayor Priya
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 04:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

చెన్నై : చెన్నై మేయర్‌ ప్రియ ముఖాన్ని ఓ సినీనటి నృత్య వీడియోకు ఎఐ సాయంతో మార్ఫింగ్‌ చేసి అసభ్యకరంగా చిత్రీకరించిన నకిలీ వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. గతంలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఆ ఫేక్‌ వీడియో వైరల్‌ అవుతోంది. టివికె ప్రభుత్వంతో ప్రోటోకాల్‌, నిధుల కేటాయింపుల విషయంలో విభేదాలు ఉన్న నేపథ్యంలో ఈ దాడులు జరుగుతున్నాయని ప్రియ ఆరోపించారు. అధికార పార్టీ సోషల్‌ మీడియా కార్యకర్తలే ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారని మండిపడ్డారు. ఆమె ఫిర్యాదుతో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నకిలీ వీడియోలపై దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారంపై సిఎం విజయ్‌ స్పందించకపోవడంపై ప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్