శుక్రవారం, 20 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎస్‌ఐఆర్‌ మధ్యలోనే ఢిల్లీ సిఇఒ బదిలీ..

4 గంటల క్రితం

ఎస్‌ఐఆర్‌ మధ్యలోనే
ఢిల్లీ సిఇఒ బదిలీ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 10:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ‌కీలక దశలో ఉండగా ఆ రాష్ర్ట ప్రధాన ఎన్నికల అధికారి (సిఇఒ)సహా ముగ్గురు ఐఎఎస్‌ అధికారులను బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. సిఇఒ అశోక్‌‌కుమార్‌‌తోపాటు 2000 బ్యాచ్ ఐఎఎస్ అధికారిణి దిల్‌రాజ్ కౌర్, వాణిజ్య, పన్నుల కమిషనర్‌, 2002 బ్యాచ్ అధికారి నిఖిల్ కుమార్ లను ఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్‌కు తక్షణమే బదిలీ చేయాలని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నెల 18న ఉత్తర్వులు జారీ చేసింది. అశోక్‌ కుమార్ అరుణాచల్ ప్రదేశ్ - గోవా - మిజోరాం కేంద్రపాలిత ప్రాంతాల (ఎజిఎంయుటి) కేడర్‌కు చెందిన 2006 బ్యాచ్ ఐఎఎస్ అధికారి. తొమ్మిది నెలల క్రితం ఢిల్లీ సిఇఒగా బాధ్యతలు స్వీకరించారు.

కీలక దశలో ఉండగా బదిలీ

దేశ రాజధానిలో ఎస్ఐఆర్ ప్రస్తుతం కీలక దశలో ఉంది. ఆగస్టు 31న ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో దాదాపు 47.5 లక్షల పేర్లను తొలగించారు. మరో సుమారు 33.1 లక్షల మంది ఓటర్లకు వారి అర్హతను ధ్రువీకరించుకోవాలని కోరుతూ నోటీసులు జారీ చేశారు. ఢిల్లీలో ఎస్‌ఐఆర్‌ ప్రారంభం కావడానికి ముందు, అంటే ఈ ఏడాది జూన్ 30 నాటికి సుమారు 1.45 కోట్ల నమోదిత ఓటర్లు ఉండేవారు. ఆగస్టులో ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో కేవలం 97.5 లక్షల పేర్లు ఉన్నాయి. తొలగించబడిన ఓటర్లను గైర్హాజరు, వేరే చోటికి మారిన, మరణించిన లేదా పునరావృత (ఎఎస్‌‌డిడి) ఓటర్లుగా వర్గీకరించారు. ఢిల్లీ ఎస్ఐఆర్‌‌లో ప్రస్తుతం, క్లెయిమ్‌లు, అభ్యంతరాల దశ గడువు ఈ నెల 25 వరకూ ఉంది. డిసెంబర్ 15 నాటికి క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారం అనంతరం, తుది ఓటర్ల జాబితాను డిసెంబర్ 22న ప్రచురించాల్సి ఉంది. ఈ కీలక తరుణంలో ఢిల్లీ సిఇఒను బదిలీ చేయడం సంచలనంగా మారింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్