సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఢిల్లీ యువతిపై సామూహిక అత్యాచారం

4 రోజుల క్రితం

ఢిల్లీ యువతిపై సామూహిక అత్యాచారం
దేశరాజధానిలో పది రోజుల్లో నాల్గో ఘటన
భద్రతారీత్యా ఆన్‌‌లైన్‌‌లో క్లాసులు బోధిస్తున్న ఎల్‌ఎస్‌ఆర్‌ కాలేజ్‌ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 09:34 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- దేశ రాజధానిలో పది రోజుల్లో నాల్గో ఘటన

- భద్రతారీత్యా ఆన్‌‌లైన్‌‌లో క్లాసులు బోధిస్తున్న ఎల్‌ఎస్‌ఆర్‌ కాలేజ్‌

‌న్యూఢిల్లీ : బిజెపి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. తాజాగా ఢిల్లీలో 17 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుంది. ఢిల్లీలో కల్కాజీ మందిరం సమీపంలోని ఆస్థా కుంజ్ పార్కులో దారుణ సంఘటన జరిగింది.

పోలీసులమని చెప్పి అఘాయిత్యం..

సోమవారం సాయంత్రం కల్కాజీ మందిరానికి ఫరీదాబాద్‌కు చెందిన యువతి తన స్నేహితుడితో కలిసి వెళ్లింది. తరువాత ఇద్దరూ కలిసి సమీపంలోని పార్కుకు వెళ్లారు. అక్కడ ముగ్గురు వ్యక్తులు తాము పోలీసులని చెబుతూ వీరిపై కత్తి, తుపాకీ చూపిస్తూ బెదిరింపులకు దిగారు. స్నేహితుడ్ని బంధించి, యువతిపై అత్యాచారం చేశారు. రాత్రి 8:45 గంటలకు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందిందింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాల్ని ఆసుపత్రికి తరలించారు. నిందితులు కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. డిఎం ఆఫీస్ రోడ్ సమీపంలో ఒక నిందితుడ్ని గుర్తించి అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. అయితే అతను పోలీసులుపై కాల్పులకు తెగబడ్డాడు. దీనికి ప్రతిగా పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడి కుడి కాలికి గాయమైంది. అరెస్టు అయిన నిందితుడిని ఆసిఫ్‌గా గుర్తించారు. అతను ఓఖ్లా మండిలో పనిచేస్తాడు. మిగతా ఇద్దరు నిందితులు హేమంత్, ముఖేష్‌లను మంగళవారం అరెస్టు చేశారు. ఈ ఘటనతో దేశ రాజధానిలో గత పది రోజుల్లో మైనర్‌ బాలికలపై నాలుగో అత్యాచార ఘటన చోటు చేసుకుంది. ఈ నెల 13న స్వరూప్ నగర్‌లో ముగ్గురు మైనర్లతో సహా మొత్తం నలుగురు 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ నెల 16న సదర్ బజార్ ప్రాంతంలో ఒక దుకాణం లోపల 10 ఏళ్ల ఆరో తరగతి విద్యార్థిని చేతులు, కాళ్లు కట్టేసి అత్యాచారం చేశారు. ఈ నెల 21న కిషన్ గంజ్ ప్రాంతంలో 34 ఏళ్ల వ్యక్తి ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తాజా ఘటన నాల్గోది. ఈ ఘటన తరువాత అంటే బుధవారం నగరంలోని అన్ని పార్కులలో భద్రతా తనిఖీ నిర్వహించాలని, వాటి ప్రాంగణాల చుట్టూ పింక్ పోలీస్ సిబ్బందిని మోహరించాలని సంబంధింత అధికారుల్ని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధు ఆదేశించారు. పార్కుల్లో తగినంత వెలుతురు, భద్రత, నిరంతర గస్తీ, సరైన పరిశుభ్రత ఉండాలని స్పష్టం చేశారు.

మరోవైపు ఈ అత్యాచార ఘటన జరిగిన పార్కుకు సమీపంలో ఉన్న లేడీ శ్రీ రామ్ మహిళా కళాశాల (ఎల్‌ఎస్‌ఆర్‌) మంగళవారం మధ్యాహ్నం నుంచి తరగతులను నిలిపివేసింది. కొన్ని సెషన్లను ఆన్‌లైన్‌లో బోధిస్తుంది. ఆస్థా కుంజ్ పార్క్ పరిసరాల్లోని వివిధ వసతి గృహాలు, నివాసాలలో కాలేజీకి చెందిన సుమారు 3 వేల మంది మహిళా విద్యార్థినులు ఉంటూ తరగతులకు హాజరవుతున్నారని ఎల్ఎస్ఆర్ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అనూష గార్గ్ తెలిపారు. అత్యాచార ఘటన విద్యార్థినుల్లో తీవ్ర ఆందోళన పెంచిందని చెప్పారు. కొంత మంది ఢిల్లీని విడిచి వెళ్ళాలని కూడా భావిస్తున్నట్లు గార్గ్‌ ‌వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్