ఆదివారం, 11 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

శాంతియుతంగా నిరసన తెలిపేవారిని నిర్బంధించవద్దు : సుప్రీంకోర్టు

12 గంటల క్రితం

sc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 11, 2026, 04:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని చట్టవిరుద్ధంగా నిర్బంధించరాదని సుప్రీంకోర్టు ఆదివారం ఆదేశించింది. కాక్రోచ్‌ జనతా పార్టీ (సిజెపి) నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో మెట్రో, రైలు సేవలను పూర్తిగా నిలిపివేయరాదన్న తమ ఆదేశాలను ఉల్లంఘించారంటూ దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్‌ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఆదివారం ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. శాంతిభద్రతల పరిస్థితులకు లోబడి ఢిల్లీ మెట్రో సాధారణ షెడ్యూల్‌ ప్రకారం నడిచేలా చూడాలని, ఇంటర్నెట్‌ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. అక్టోబర్‌ 9న జారీ చేసిన ఆదేశాల ఉల్లంఘనతోపాటు, అక్టోబర్‌ 10న ఢిల్లీలో పెద్ద సంఖ్యలో నిరసనకారులను చట్టవిరుద్ధంగా నిర్బంధించారంటూ దాఖలైన అత్యవసర పిటిషన్ల విచారణకు ధర్మాసనం ప్రత్యేకంగా సమావేశమైనట్లు పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్