శనివారం, 01 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

దేశంలో ఉమ్మివేసి.. విదేశాల్లో పరిశుభ్రంగా ఉంటారా ? : బాంబే హైకోర్టు

14 గంటల క్రితం

Do you spit in the country but maintain cleanliness abroad? : Bombay High Court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 01, 2026, 12:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : ముంబయిలోని డంపింగ్‌ యార్డ్‌ల వద్ద కాలుష్యం, విష వాయువులకు సంబంధించిన పిటిషన్లపై విచారణ సందర్భంగా .... బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజలు బహిరంగంగా చెత్త పారవేయడం, రోడ్లపై ఉమ్మి వేస్తుండటం పై ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో ఇష్టానుసారం వ్యవహరిస్తూ.. విదేశాల్లో మాత్రం పరిశుభ్రంగా ఉంటారా..? అని ప్రశ్నించింది. ఇక్కడ రోడ్లపై ప్రతిరోజూ చెత్త పడేసే వాళ్లు విదేశాల్లో చిన్న చాక్లెట్‌ కవర్‌ బయట పడేయాలన్నా ఆలోచిస్తారని వ్యాఖ్యానించింది. వీధులు, ఖాళీ ప్రదేశాల్లో చెత్తాచెదారం లేకుండా చూసేందుకు పౌరులకు, మున్సిపల్ అధికారులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పరిసరాలను శుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత అని.. అటువంటి వారికే పరిశుభ్రమైన వాతావరణాన్ని కోరుకునే హక్కు ఉంటుందని జస్టిస్ జి.ఎస్. కులకర్ణి, ఆర్తి సాఠేలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. రోడ్లపై చెత్త, ఉమ్మి వేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ప్రధాన రహదారులు, వీధుల్లో పడేసిన చెత్త వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని న్యాయస్థానం పేర్కొంది. అసలు మనం నాగరిక సమాజంలోనే జీవిస్తున్నామా ? అని ప్రశ్నించింది. హైకోర్టు భవనం సహా నగరంలోని వారసత్వ కట్టడాల సమీపంలో చెత్తను నిర్వహించే తీరుపైనా ఆందోళన వ్యక్తం చేసింది. మున్సిపల్ వాహనాల అస్తవ్యస్త నిర్వహణ వల్ల.. ఈ ప్రాంతాలను సందర్శించే విదేశీయులతో సహా అనేకమంది పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది. దీనిపై వారం రోజుల్లోగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోర్టు ఆదేశించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్