ఆదివారం, 25 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలి

1 గంట క్రితం

బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలి
- గత రెండేండ్లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయాలి
- ఎఐసీసీ చీఫ్ ఖర్గే డిమాండ్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026, 11:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • గత రెండేళ్లలో*జరిగిన అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయాలి

  • ఎఐసిసి చీఫ్ ఖర్గే డిమాండ్

​పాట్నా: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్‌) ప్రక్రియను వెంటనే నిలిపివేసి, అన్ని ఎన్నికలను బ్యాలెట్ పేపర్ల ద్వారానే నిర్వహించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే డిమాండ్ చేశారు. గత రెండేండ్లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయాలన్నారు. ఎస్‌ఐఆర్‌‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను ‘‘రెండో స్వాతంత్య్ర యుద్ధం’’గా అభివర్ణించారు. పశ్చిమ బెంగాల్, హర్యానా, బీహార్, మహారాష్ట్రలో ‘ఓట్ల చోరీ’ ద్వారా ప్రభుత్వాలను ఏర్పాటు చేశారని, ఈ దొంగలందరినీ జైలుకు పంపిస్తామన్నారు. ప్రజలు వీధుల్లోకి వచ్చి, తమ హక్కుల కోసం పోరాడాలని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఎన్నికల సంఘం నుంచి ప్రజలకు పారదర్శకత, జవాబుదారీతనం కావాలని పేర్కొన్నారు. బీహార్ తొలి ముఖ్యమంత్రి డాక్టర్ కృష్ణ సింగ్ 139వ జయంతి ఉత్సవాల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగించారు. ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిల భావజాలం దేశంలో విభజనలను మరింత తీవ్రతరం చేస్తోందని ఖర్గే వ్యాఖ్యానించారు . ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నిర్మూలించే వరకు దేశంలో శాంతి ఉండదన్నారు . నితీశ్ కుమార్ వంటి సోషలిస్ట్ నాయకులు, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తులతో చేతులు కలపడం నాకు బాధ కలిగిస్తోందన్నారు. అలాగే, హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఖర్గే డిమాండ్‌ చేశారు. కుల వివక్ష, వెలివేత వంటివి మానవ గౌరవాన్ని, సమానత్వాన్ని దెబ్బతీస్తాయని ఆయన అన్నారు. దేశంలోని ప్రతి ఆలయంలోకి దళితులు ప్రవేశించేందుకు, అక్కడ పూజలు చేసుకునేందుకు వారికి పూర్తి హక్కు ఉండాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు స్పష్టం చేశారు. బీహార్ తొలి ముఖ్యమంత్రి కృష్ణ సింగ్ వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, నీటిపారుదల రంగాలను ప్రోత్సహించడం ద్వారా ఆధునిక రాష్ట్రానికి పునాదులు వేయడంలో సహాయపడ్డారని ఖర్గే అన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్