గురువారం, 13 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

మొరాయించిన ఇంజిన్ - ఇండిగో విమానానికి తప్పిన పెనుప్రమాదం

1 రోజు క్రితం

Engine Malfunction – Narrow Escape for Indigo Flight
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 12, 2026, 11:28 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

చెన్నై : చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో మంగళవారం అర్ధరాత్రి కలకలం రేగింది. 224 మంది ప్రయాణికులతో ఇండిగో విమానం కోల్‌కతా నుంచి చెన్నైకి బయలుదేరింది. విమానం గాల్లో ఉండగా ఇంజిన్ మొరాయించడంతో .... పైలట్ చాకచక్యంగా విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో విమానానికి పెను ప్రమాదం తప్పింది. కోల్‌కతా నుంచి చెన్నై కు బయలుదేరిన ఇండిగో ఫ్లైట్ 6E-723 నిన్న రాత్రి 11:30 గంటలకు చెన్నైలో ల్యాండ్ కావాల్సి ఉంది. ల్యాండింగ్‌కు కొద్ది నిమిషాల ముందు ఎడమ ఇంజిన్‌లో లోపం తలెత్తింది. రాత్రి 11:29 గంటల సమయంలో పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి సమాచారం ఇచ్చారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు తక్షణమే అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. రన్ వే 25 పై రాత్రి 11:37 గంటలకు విమానం క్షేమంగా ల్యాండ్ అయింది. విమానంలో ఉన్న 224 మంది ప్రయాణికులు, సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారు. రాత్రి 11:47 గంటలకు ఎమర్జెన్సీని ఉపసంహరించుకున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్