సోమవారం, 24 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

జోరు వర్షంలోనూ .. మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్యమం

29 జులై, 2026

protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 29, 2026, 06:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ మహిళా రిజర్వేషన్ కూటమి చేపట్టిన సంయుక్త ఆందోళన మంగళవారం జోరు వర్షంనూ కొనసాగింది. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న ఆందోళన మంగళవారంతో ఏడో రోజుకు చేరుకుంది. ఉదయం 10 గంటలకు ధర్నా ప్రారంభమైన వెంటనే ఆ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షాన్ని సైతం లెక్కచేయకుండా, మహిళలు నినాదాలు చేస్తూ, అచంచలమైన సంకల్పాన్ని ప్రదర్శిస్తూ వీధుల్లో కవాతు చేశారు. ప్రకృతి ప్రకోపం, అధికార యంత్రాంగం అణచివేత చర్యలు మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలనే తమ సంకల్పాన్ని బలహీనపరచలేదని బుధవారం ఘటన రుజువు చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్