పనాజీ:
ప్రపంచ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (IFFI) శుక్రవారం గోవాలో అట్టహాసంగా ప్రారంభమైంది. నవంబర్ 20న మొదలైన ఈ వేడుక తొమ్మిది రోజుల పాటు జరగనుంది. ఈ వేడుకలో పాల్గొనే దేశ విదేశాల నుండి తరలివచ్చే సినీ ప్రముఖులు, కళాకారులు, ప్రతినిధులు, సినీ అభిమానులకు స్వాగతం పలికేందుకు గోవా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
'సరిహద్దులు లేని కథలు' (Stories Beyond Borders) అనే ఇతివృత్తంతో ఈ ఏడాది చలనచిత్రోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలకు గోవాలోని డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో జరిగిన ప్రారంభోత్సవ వేడుకతో అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సంగీత, సాంస్కృతిక మరియు అధికారిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.








కామెంట్‌లు (0)