శుక్రవారం, 09 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

14 ఏళ్ల నిరీక్షణ అనంతరం తొలి ఉద్యోగోన్నతి

28 జూన్, 2026

crpf
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 28, 2026, 11:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- 263 మంది సిఆర్‌‌పిఎఫ్‌ ఎసిలకు డిసిలుగా ప్రమోషన్‌ ​

న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద పారామిలిటరీ దళమైన కేంద్ర రిజర్వు పోలీసు బలగాలు (సిఆర్‌‌పిఎఫ్‌)కు చెందిన 263 మంది అధికారులు 14-15 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు తమ తొలి కెరీర్ ప్రమోషన్‌ పొందారు. 263 మంది అసిస్టెంట్ కమాండెంట్ (ఎసి) ర్యాంకు అధికారులను డిప్యూటీ కమాండెంట్ (‌డిసి)గా ఉద్యోగోన్నతి కల్పిస్తూ ఈ నెల 26న సిఆర్‌‌పిఎఫ్‌ ‌ప్రధానకార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఎసి ర్యాంకు అనేది కేంద్ర బలగాలలో ప్రవేశ స్థాయి ర్యాంకు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్రమోషన్‌ ఇవ్వడం పట్ల సిఆర్‌పిఎఫ్‌ అధికారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ‘ఈ పరిణామం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కెరీర్‌‌లో తొలి ప్రమోషన్‌ కోసం 14, 15 ఏళ్లుగా ఎదురుచూస్తున్న అధికారులకు ఇది నైతిక స్థైర్యాన్ని పెంచుతుంది. వాస్తవానికి ఈ ప్రమోషన్‌ ఐదేళ్లలో‌నే రావాలి’ అని ఒక సీనియర్ సిఆర్‌‌పిఎఫ్‌ అధికారి తెలిపారు. కాగా కేంద్ర బలగాల స్థైర్యాన్ని దెబ్బతీసేలా అనేక వినాశక విధానాలు అమల్జేస్తూ వచ్చిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఈ ప్రమోషన్లను కూడా తొక్కిపెడుతూవచ్చింది. సీనియారిటీ, నిబంధనలు, ఖాళీలు తదితర సాకులతో నాన్చుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించి సుదీర్ఘ న్యాయపోరాటం చేశారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 16న ప్రమోషన్లు చేపట్టాల్సిందేనంటూ సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. తదనంతరం సిఆర్‌‌పిఎఫ్‌ ప్రధాన కార్యాలయం ‌కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఎ)తో సంప్రదింపులు జరిపి ఎట్టకేలకు ప్రమోషన్ల ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సిఆర్‌‌పిఎఫ్‌ ‘ఒక ముఖ్యమైన మైలురాయి’గా పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‌పనిచేసే కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సిఎపిఎఫ్‌) 3.25 లక్షల మంది ఉండగా..అందులో కేంద్ర రిజర్వు పోలీసు బలగాలు (సిఆర్‌‌పిఎఫ్‌) అత్యంత ప్రధాన అంతర్గత భద్రతా దళంగా పేరుపొందింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్